Advertisement
జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. వారికంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిల అందం కంటే వారి అలవాట్లను ఎక్కువగా గమనిస్తారు. అయితే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారో చెప్పలేని పరిస్థితి. కొందరు అబ్బాయిలు జులాయిగా ఉన్న అమ్మాయిలకు నచ్చేస్తారు. కొందరు పద్ధతిగా రాముడిలా కనిపించినా నచ్చరు. అయితే అమ్మాయిలు అంతా కోరుకునే జనరల్ లక్షణాలు ఒక 5 ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
READ ALSO : రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?
# తెలివితేటలు.
అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు తెలివైన వారై ఉండాలి. అమ్మాయిలు ఎక్కువగా తెలివైనవాడు కావాలని కోరుకుంటారు. వారు ఇష్టపడే అబ్బాయి మరి దద్దిగా ఉంటే వాళ్లకు నచ్చదు. కాస్త తెలివైనవాడు అయి ఉండాలని కోరుకుంటారు. పరిస్థితులను చక్కదిద్దగల వ్యక్తి అవ్వాలని ఆశపడుతూ ఉంటారు.
# ధైర్యం.
అమ్మాయిలు ఇష్టపడే వాటిలో కాన్ఫిడెన్స్, హైట్, పర్సనాలిటీ, అందం వీటి గురించి పక్కన పెడితే.. ఏ సందర్భం అయినా, ఎలాంటి కష్టమైన పరిస్థితి అయినా మీరు ఎదుర్కొనగలరనే నమ్మకం వారికి కలగాలి. మీరు ఒక ధైర్యవంతులని, మీతో ఉంటే వారికి ఎలాంటి భయం ఉండదని నమ్మకాన్ని వారికి కలిగించాలి. అలాంటి అబ్బాయిని అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారు.
Advertisement
READ ALSO : ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
# సమయస్ఫూర్తి.
అబ్బాయి సమయస్ఫూర్తిగా ఉండి అమ్మాయిల్ని అప్రోచ్ అయితే వాళ్లు దాదాపు 90% ఆ అబ్బాయికి పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఎన్నో సర్వేల్లో తేలింది. ఈ అమ్మాయికి అయినా అబ్బాయి ఎప్పుడూ కోపంగా, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటే నచ్చదు. అబ్బాయి అనే వాడు కాస్త జోవియల్ గా ఉండాలి. అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఎదుటివారిని నవ్వించాలి. అతనితో ఉంటే టైం తెలియదు అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి. నవ్వించే అబ్బాయికి అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవుతారు.
# నిజాయితీ.
ఏ లక్షణం ఉన్న లేకపోయినా ఈ లక్షణం మాత్రం తప్పకుండా ఉండాలి. అమ్మాయిలు అబద్ధాలు చెప్పే వ్యక్తులను ఎప్పుడూ ఇష్టపడరు. అంతేకాదు వారికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే నిజాయితీగా ఉండాలి. ఎవరితోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలి. మీరు తప్పు చేసిన దానిని నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజాయితీగా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
# గౌరవం ఇవ్వాలి.
స్త్రీలు, అమ్మాయిలు వారికంటూ సముచిత స్థానాన్ని, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలో వారికి అవకాశం కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, వారికి కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. వారిని వారిలా గౌరవించే అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు.
READ ALSO : ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!