Advertisement
వయసు పెరిగి కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ముఖంపై మచ్చలు, గీతలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ అందంపై దృష్టి ఎక్కువ పెట్టాలి. లేదంటే అందం పాడవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముడతలు రావడానికి వాయిదా వేసుకోవడానికి అవుతుంది. రోజూ తగిన నీళ్లు తాగితే చర్మం బాగుంటుంది. తేమగా, మృదువుగా ఉంటుంది. అలాగే సూర్య కాంతి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి మంచి సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగించడం మంచిది.
Advertisement
బెర్రీస్, గింజలు, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవడానికి మంచి ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. అలాగే తరచు ముఖాన్ని మసాజ్ చేయాలి. దీని వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. ముడతలు, వాపులు తగ్గుతాయి.
Advertisement
Also read:
విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండే క్రీమ్స్ లేదా ఆయిల్స్ వాడితే చర్మం లో కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయేలా చూసుకోండి. చర్మం యవ్వనంగా ఉంటుంది ఈ విషయాలన్నిటినీ మీరు కనుక ఫాలో అయ్యారంటే చర్మం చాలా బాగుంటుంది. అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!