Advertisement
టాలెంట్ ఉండాలి కానీ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకవచ్చు అనే సామెత ఊరికే రాలేదు.. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో రాణించాలంటే అందంతోపాటుగా నటన టాలెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా రాణించవచ్చు. నీలో సత్తా ఉండాలి కానీ అవకాశాలు వాటికవే తన్నుకుంటూ వస్తాయి.. ఆ విధంగానే కొంతమంది హీరో,హీరోయిన్స్ తెలుగు గడ్డపై పుట్టినా తమిళ, కన్నడ ఇతర భాషల్లో సూపర్ స్టార్స్ గా ఎదిగారు.. వారెవరో ఓ లుక్కేద్దాం..
విశాల్ :
Advertisement
హీరో అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ జీకే కృష్ణ కుమారుడు. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ సినిమాలన్నీ తమిళ్ టు తెలుగు డబ్బింగ్ అయినవే.
సమీరా రెడ్డి :
హిందీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి రాజమండ్రి ముద్దుగుమ్మ. తెలుగులో కూడా జై చిరంజీవ, నరసింహుడు, అశోక్ లో నటించింది.
ఆది పినిశెట్టి:
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి. ఈయన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు చిత్రం “ఒక విచిత్రం” అనే సినిమాతో మొదలైంది. కానీ నటుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం తమిళ సినిమా “ఈరం” ఇది తెలుగులో వైశాలిగా రిలీజ్ అయింది. ఆది పది సంవత్సరాల సినీ జీవితంలో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే తెలుగులో నటించారు.
సాయి కుమార్ :
కన్నడ ఇండస్ట్రీలో సాయి కుమార్ కు స్టార్ హీరో హోదా ఉంది. తెలుగు సినిమాల కంటే కన్నడ సినిమాలే ఆయన ఎక్కువ శాతం నటించారు. ఆయన డైలాగ్స్ తో విశేష ఆదరణ పొందారు.
జానీ లివర్ :
Advertisement
also read: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 26.10.2022
హిందీలో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న జానీలీవర్ తెలుగువాడే. ప్రకాశం జిల్లాకు చెందిన జానీ చిన్నతనంలోనే కుటుంబం ముంబై షిఫ్ట్ అవడంతో అక్కడే సెట్ అయిపోయాడు. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.
జీవా:
“ఎందుకో ఏమో” అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. తను నటించిన కొన్ని సినిమాలు తెలుగు డబ్బింగ్ అప్పటికి “రంగం” సినిమా మాత్రమే తనకు గుర్తింపు ఇచ్చింది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన జీవ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరి కొడుకు.
దియా మీర్జా :
హైదరాబాద్ చెందిన ఈ అమ్మడు మోడల్. మిస్ ఆసియా పసిఫిక్ గా గుర్తింపు వచ్చిన తర్వాత బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. తెలుగు లో నటించడానికి ఇష్టం ఉందని దియా చాలా సార్లు చెప్పినా అవకాశాలు రాలేదు.
శ్రీరామ్ :
ఒకరికి ఒకరు అనే మూవీ ద్వారా తెలుగు వారికి పరిచయమైన నటుడు శ్రీరామ్ కూడా తెలుగు వాడే. తెలుగు ఇండస్ట్రీ లో నటించిన అంతగా పేరు రాలేదు కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం చాలా పరిచయం ఉన్న నటుడు. కానీ అక్కడ శ్రీరామ్ అంటే ఎవరు గుర్తు పట్టారు శ్రీకాంత్ అంటే గుర్తు పడతారు.
also read: