Advertisement
ఇతరులతో మనకు సంబంధించిన వస్తువులు పంచుకోవడం కామన్. కావలసినప్పుడు సాయం చేయడంలో తప్పులేదు. కానీ ఆ సాయం మనకు దరిద్రాన్ని తెచ్చి పెట్టేదై ఉండకూడదు కదా ! మనకు తెలిసో, తెలియకో చాలాసార్లు ఇవ్వకూడని వస్తువులు ఇతరులకు ఇచ్చేస్తుంటారు.
Advertisement
కొందరి రాశుల ప్రకారం వారు వాడిన వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే అవి తిరిగి మళ్ళీ మీరు వాడుకోవద్దు. ఈరోజు మనం ఇతరులతో పంచుకోకూడని వస్తువులు ఏంటో చూద్దాం!
Advertisement
జ్యోతిష్య శాస్త్రంలో ఎవరికి రుమాలు ఇవ్వకూడదని చెప్పారు. మీరు ఎవరికైనా రుమాలు ఇవ్వాలనుకుంటే మీరు దానిని ఎక్కడో ఉంచి అవతలి వ్యక్తిని తీసుకోమని చెప్పవచ్చు. చేతికి రుమాలు ఇవ్వడం వల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుంది. మీరు ఎవరికైనా రొట్టె ఇస్తున్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ ప్లేటులో పెట్టి ఇవ్వాలి.
ఏ వ్యక్తికైనా చేతిలో రొట్టెలు ఇవ్వడం వల్ల ఇంటికి ఐశ్వర్యం పోతుంది. తాగడానికి నీటిని ఏ వ్యక్తికి మీ దోసిళ్ళతో పోయకూడదు. ఇది చేయడం వల్ల ఐశ్వర్యం నశిస్తుంది. మిరపకాయలు కూడా ఒక వ్యక్తి నేరుగా ఇవ్వకూడదు. ఎవరి చేతిలోనూ ఉప్పు ఇవ్వకూడదని, వేరొకరి ఇంట్లో ఉప్పు అడగకూడదని, జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం ఉంటుంది.
READ ALSO : చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..