Advertisement
శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటుగా మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం..?
Advertisement
ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మంచి రోజు. ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంటికి సంపద వైభవం వస్తుందని నమ్ముతుంటారు. అందుకే శుక్రవారం రోజున దానాలు, ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా మనల్ని ఎప్పుడూ ధనవంతులు గా ఉండేలా ఆశీర్వదిస్తుంది.
Advertisement
శుక్రవారం రోజున ఇంట్లో పగిలిపోయిన లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటే నిమజ్జనం లాంటివి చేయకూడదు. సాయంత్ర సమయంలో ప్రార్థన చేసే ముందు మన ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున ఎవరి దగ్గర రుణం తీసుకోవద్దు, ఇవ్వవద్దు. ఈ విధంగా చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది అని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
also read;
సినిమాల్లోకి రాకముందు వీరి అసలు పేర్లు ఏంటంటే?