Advertisement
ఈ ఏడాది దీపావళి మరుసటి రోజున కాకుండా ఆ తర్వాతి రోజు ప్రారంభమైంది కార్తీక మాసం. కారణం ఈసారి అమావాస్య 24,25 తేదీలలో ఉండటంతో దీపావళి పండుగ 24 వ తేదీన జరుపుకున్నారు. 25వ తేదీ అమావాస్య తోపాటు సూర్యగ్రహణం ఉండటంతో ఆ రోజున పండుగలు జరుపుకోకూడదని జ్యోతిష్య నిపుణులు అన్నారు.
Advertisement
దీంతో 25వ తేదీ సాయంత్రం తర్వాత పాడ్యమి ఘడియలు వచ్చినప్పటికీ, సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండాలి కాబట్టి, ఈ తిదినే నెల ప్రారంభానికి సూచికగా పరిగణిస్తారు.
also read: పోలవరం ప్రాజెక్టుకు పవన్ నాలుగో పెళ్లికి లింకు పెట్టిన రాంబాబు!
Advertisement
కాబట్టి బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీకమాసానికి సమానమైన మాసము అంటూ లేదు, ఎందుకంటే శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడని, వేదంతో సమానమైన శాస్త్రం లేదని, గంగతో సమానమైన తీర్థం లేదని స్కంద పురాణంలో చెప్పబడింది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత. ఈ మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసం. ఇందులో శివున్ని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వ తేదీ వరకు ఇది ఉంటుంది. ఈ నెల రోజుల పాటు నియమనిష్ఠలతో శివకేశవులను పూజిస్తారు.
కార్తీకమాసంలో పాటించే నియమాలు :
1.ఒక్కపూట భోజనం చేయాలి.
2.శాకాహారాన్ని మాత్రమే భుజించాలి.
3.మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోరాదు.
4.మంచంపై పడుకోకూడదు.
5.దానధర్మాలు ఎక్కువగా చేయాలి.
6.నదీ స్నానం చేసి కార్తీకదీపాలను అందులో వదిలేయాలి..
also read:ఈ తెలుగు హీరో హీరోయిన్స్.. తెలుగులో కంటే ఇతర భాషల్లో సూపర్ స్టార్స్.. ఎవరంటే..?