Advertisement
వయస్సు వచ్చిన ఎవరైనా సరే.. పెళ్లి గురించి ఆలోచించాలనేది పాత మాట. అప్పట్లో అయితే ఆ ఏజ్ కి పెళ్లి వయసు వచ్చేసిందని, లేట్ అయితే ముదురు బెండకాయ అంటారని కంగారు పడేవాళ్లు. అయితే ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 30 ఏళ్లకు పెళ్లి చేసుకున్న, చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నట్టే లెక్క. చదువు, ఉద్యోగాల పేర్లు చెప్పి అప్పటివరకు చాలామంది లాగించేస్తున్నారు అనుకోండి. కొన్నాళ్లు పోతే మన హర్షవర్ధన్ చెప్పినట్టు పెళ్లి అనే మాటని చాలామంది దూరం పెడతారేమో.
Advertisement
ఇవి కూడా చదవండి: సినిమాల్లో “వకీల్ సాబ్” లుగా నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !
సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా అంతేలా ఉంది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీలు మాత్రమే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేసేవారు. ఇప్పుడు టీవీ వాళ్లు కూడా అంతే! అదే బుల్లితెర స్టార్ల గురించి చెబుతున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన ఇంకా వాళ్ళు హాయిగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్ వేద్దాం రండి.
#1 రష్మీ గౌతమ్:
ఈమె వయసు 30 ఏళ్లు దాటిందని 5 ఏళ్ల నుండి చెబుతున్నారు కానీ, ఈమె కరెక్టు వయసు ఎంతో ఎవరికి తెలియదు. గూగుల్ లెక్కల ప్రకారం అయితే ఈమె వయసు 32 ఏళ్లు. అయినప్పటికీ ఈమె పెళ్లి గురించి ఆలోచించకుండా టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: వింత ఆచారం, శోభనం గదిలోకి పిల్లలతో తల్లి రావాల్సిందే!
#2 విష్ణుప్రియ:
33 ఏళ్ల వయసు వచ్చిన ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుస టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
#3 హైపర్ ఆది:
ఈ ఎనర్జిటిక్ కమెడియన్ వయసు 31 ఏళ్లు. వరస సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
#4 సుడిగాలి సుదీర్:
బుల్లితెర బిజీ ఆర్టిస్టులలో సుదీర్ ముందు వరుసలో ఉంటాడు. 33 ఏళ్ల వయసు వచ్చిన ఇతను ఇంకా పెళ్లి చేసుకోకుండా, హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
#5 ప్రదీప్:
ఈ స్టార్ యాంకర్ వయసు 34 ఏళ్లు. ఇప్పుడు హీరోగా కూడా మారాడు. 24*7 బిజీగా ఉండే ఈ స్టార్ యాంకర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
Read also : జాతీయ జెండాను అవమానించిన రోహిత్..అంటూ నెటిజన్లు ఆగ్రహం..మీరు ఇంత ఫేకా ?