Advertisement
ప్రకాశం జిల్లాలోని జిల్లెల్ల పాడు గ్రామానికి చెందిన కోట రాధా (35) హత్యకు గురైన ఘటన తాజాగా చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం .. జిల్లెల పాడు గ్రామానికి చెందిన కోట రాధాకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మోహన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఇద్దరు కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ నుంచి జిల్లెల్ల పాడు గ్రామానికి వచ్చారు. భర్త మోహన్ రెడ్డి తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
Advertisement
రాధా కుమారుడిని తీసుకొని కనిగిరి వెళ్లి వస్తానని తండ్రి సుధాకర్ రెడ్డి తో చెప్పి వెళ్ళింది. కనిగిరిలో ఉంటున్న బాబాయ్ వద్ద కుమారుడిని వదిలిపెట్టి బజారులో పని ఉంది చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళింది. రాత్రి 10 గంటలకు కూడా రాదా ఇంటికి రాలేదు. దీంతో సుధాకర్ రెడ్డి అతని తమ్ముడు కనిగిరి అంతా వెతికారు. అయినా కనిపించకపోవడంతో కనిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా జిల్లెల్లపాడు వద్ద చూపిస్తుందని తెలియజేశారు. జిల్లెల్లపాడు అడ్డరోడ్డుకు వెళ్లి చూడగా తారు రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
Advertisement
సంఘటన స్థలానికి డిఎస్పి రామరాజు సిఐ శ్రీనివాసులు చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేష్ కుమార్ తెలియజేశారు.. అయితే రాధా హ* పై చాలా అనుమానాలు నెలకొన్నాయి. రాధకు గన్నవరం పంచాయతీ గండ్లోపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హ* జరిగి ఉండవచ్చని, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇటీవల ఐపీ పెట్టినట్టు సమాచారం అందుతుంది. మరి ఈ హ*కి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా , ఎవరి ప్రమేయమైనా ఉందా ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది..
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: