Advertisement
మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. ఇక ఈ సాంప్రదాయాలను డబ్బు విషయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి. అలాంటి డబ్బును ఒక వారంలో రెండు రోజులు ఇతరులకు అస్సలు ఇవ్వరు. వారిస్తే తీసుకుంటారు కానీ ఇతరులకు డబ్బులు మాత్రం ఇవ్వరు.. మరి అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. బృగు మహర్షి బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు.
Advertisement
Also Read: కేటీఆర్ పై కిషన్ రెడ్డి.. మోడీపై కేటీఆర్.. పంచ్ ల ప్రవాహం..!
సప్త ఋషుల్లో అయినా ఒకరు. ఇతనికి దక్ష ప్రజాపతి కూతురు ఖ్యాతి దేవితో పెళ్లి అవుతుంది. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కలుగుతారు. వారి పేర్లు విధాత,ధాత, శ్రీ మహాలక్ష్మి. ఇందులో విష్ణువును శ్రీ మహాలక్ష్మి పెళ్లాడుతుంది. అయితే మనం వ్యవహరించే శుక్రవారానికి మరో పేరు బృహ వారం. ఈ సందర్భంలో ఈరోజునే మహాలక్ష్మి ఆయనను విడిచి విష్ణువును పెళ్లి చేసుకొని వెళ్ళిందని చెబుతారు. అందుకే ఈరోజున మహాలక్ష్మి స్వరూపమైన డబ్బును ఎవరు ఇతరులకు ఇవ్వరు. అలా చేస్తే డబ్బు దక్కడం కష్టమని , ఆర్థిక కష్టాలు ఏర్పడతాయని అందుకే శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు.
Advertisement
Also Read:కవిత ప్రోగ్రాంపై సస్పెన్స్..!
అంతే కాదు మంగళవారం కూడా డబ్బు ఇతరులకు ఇవ్వరు. మంగళవారం ఎందుకు ఇవ్వరు అంటే.. మంగళవారం రోజున కుజ గ్రహానికి సంబంధించింది. కుజుడు మానవుల సంపదకు ఆరోగ్యానికి కలహాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తారట. అందుకే ఆరోజున ఎవరైనా సంపదను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు సంపద అనుగ్రహిస్తాడట. దీంతో ఇచ్చిన వారికి కష్టాలు వచ్చి తీసుకున్న వారికి లాభాలు వస్తాయని ఇతరులకు మంగళవారం డబ్బులు ఇవ్వరు
Also Read:కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!