Advertisement
రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు. రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు, ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ 4 వస్తువులను తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం. వీటి గురించి టిటిఈ కి తెలిస్తే నేరుగా మీకు జైలు శిక్ష, లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ 4 వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) యాసిడ్ బాటిల్స్.
రైలులో యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ప్రయాణికుడు ఇలా చేసి పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతడిని వెంటనే అరెస్టు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లినందుకు రూ. వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అందువల్ల రైలులో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండండి.
Advertisement
2) గ్యాస్ సిలిండర్.
ఇతర ప్రాంతాలలో పనిచేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు గ్యాస్ స్టవ్ లు, లేదా సిలిండర్లు తీసుకువస్తుంటారు. ఇలా రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు తీసుకువెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్ట విరుద్ధం. ఒకవేళ రైలులో ఖాళీ సిలిండర్ ను తీసుకువెళ్లాలని భావిస్తే ముందుగా రైల్వే అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిండుగా ఉన్న సిలిండర్ దొరికితే జైలు శిక్ష, లేదా కఠినమైన జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
3) క్రాకర్స్.
రైళ్లలో పటాకులు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. రైళ్లలో పటాకులు పేలడం వల్ల మంటలు చెలరేగి ప్రాణం నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకువెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
4) ఆయుధాలు
రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, ఈటె, రై***ఫిల్ ఇలా ఇతర ప్రాణాంతక ఆయుధాలను తీసుకువెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు. దీనికోసం మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Read also: మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగిఉంది ఎక్కడో గుర్తించండి..?