Advertisement
mahashivratri 2023: ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం రోజు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తోంది. శివరాత్రిరోజు చేయాల్సినవి, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
Advertisement
శివరాత్రి రోజున చేయాల్సిన పనులు:
సూర్యోదయానికి 2 గంటల ముందే నిద్ర లేవాలి.
ధ్యానం చేసి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను వేసుకోవాలి.
శివుడి వ్రతాన్ని ఆచరించిన వెంటనే బ్రహ్మచర్యం పాటించాలి.
ఉపవాసానికి ముందు రోజు నుండి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే రెగ్యులర్ డైట్ ప్లాన్ మార్చడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మీ వైద్యుడి సలహా తీసుకునే ఉపవాసం పాటించండి. ఓం నమ:శివాయ అని వీలైనన్ని సార్లు జపించండి. ఇంట్లో లేదంటే దేవాలయంలో శివలింగానికి నీరు లేదంటే పాలతో అభిషేకం చేయండి. పెరుగు, తేనె, నెయ్యితో కూడా అభిషేకం చేయవచ్చు.
Advertisement
పండ్లు, బిల్వ పత్రాన్ని,దతుర పువ్వులు సమర్పించండి.
పసుపునకు బదులు శివునికి చందనాన్ని సమర్పించండి.
అర్థరాత్రి టైంలో పరమేశ్వరుడికి పూజలు చేయండి. వ్రత నిర్ధిష్ట పదార్థాలతో పాలు, పండ్లు ఇతరత్రా వంటకాలను తీసుకోండి.
చేయకూడని పనులు :
ఉల్లి, వెల్లుల్లిని,మాంసం, తినకూడదు.
బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గోధుమలు వంటి ఆహారాలకు దూరంగా ఉండండి.
శివలింగానికి కొబ్బరి నీళ్లు సమర్పించరాదు.
కేతకి పువ్వులకు దూరంగా ఉండండి.
తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు
పొగాకు, మద్యాన్ని సేవించకూడదు.
పూజ కోసం స్టీల్ పాత్రలకు దూరంగా ఉండాలి. బదులుగా ఇత్తడి, వెండి,రాగి పాత్రలను ఉపయోగించండి.
నలుపు రంగు దుస్తులను దూరంగా ఉండాలి.
also read: