Advertisement
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి స్టార్డం వస్తుందో, ఎవరు ఇండస్ట్రీకి దూరమై వెళ్ళిపోతారో చెప్పడం చాలా కష్టం.
Advertisement
ఇందులో హీరోయిన్ల విషయానికి వస్తే మరీ ఎక్కువ. ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపిన ముద్దుగుమ్మలు అంతటితో సైలెంట్ అయిపోతారు. దానికి రీజన్స్ ఎన్ని ఉన్నా ముఖ్యంగా చెప్పాల్సింది వారి యొక్క అందం.
ఆ విధంగా గ్లామర్ ను మెయింటైన్ చేయలేక చివరికి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ కీర్తి చావ్లా. ఈ అమ్మడు అందాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి చాలా బోద్దు గానే ఉంది. ఎన్టీఆర్ తో ఒక్కసారి చేసి తన రేంజ్ పెంచుకుంది. కానీ దాన్ని ఎక్కువ రోజులు కాపాడుకోలేక పోయింది. అత్యధిక రెమ్యూనరేషన్ కావాలని ఆశపడి మంచి మంచి ప్రాజెక్టులను వదిలేసింది. ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లకు కొదవలేదు. ఈ తరుణంలో ఈ విధంగా మంచి అవకాశాలు వస్తే వదిలి పెట్టుకోవడం అంటే అది హీరోయిన్లకు మైనస్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడును అందరూ మర్చిపోయారు.
Advertisement
మెల్లిమెల్లిగా డైరెక్టర్స్ కూడా అవకాశాలు తగ్గించారు. అప్పటికి ఉన్న ఫాలోయింగ్ తో కొన్ని సినిమాలు చేసినా అది మాత్రం హిట్ కాలేదు. దీంతో కెరీర్ డిజాస్టర్ అయ్యింది. అయినా ఈ అమ్మడు ఇప్పటి వరకు మాత్రం పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం భయం.. ఆ భయం ఏంటంటే పెళ్లి తర్వాత పిల్లలను కనాలి. పిల్లలను కనాలంటే హాస్పిటల్ కి వెళ్లాలి. అయితే మొదటినుంచి హాస్పటల్ అంటే భయం ఉండటం వల్ల ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడం లేదని టాక్ ఉంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారట, దీంతో చాలామంది ఈమె చెప్పిన ఈ విషయాన్ని విని నవ్వుకుంటున్నారు. ప్రపంచంలో ఎవ్వరు కూడా నీ లాగా ఉండరు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ALSO READ:
కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!