Advertisement
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 15వ తేదీన అంటే మంగళవారం 4:10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణకు నివాళులు అర్పించారు.
Advertisement
ఇది ఇలా ఉంచితే, కృష్ణ ఎప్పుడూ పబ్లిక్ లోకి వచ్చిన స్టైల్ గా కూలింగ్ గ్లాసులో కనిపించేవారు. అలా కృష్ణ కూలింగ్ గ్లాసులు ధరించడానికి ఓ కారణం ఉందట. ఆ విషయాన్ని విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. “కృష్ణ నీ పెళ్లి చేసుకున్న తర్వాత అతడిని కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్లు కనిపించారంటే కృష్ణకి ఫస్ట్ కూలింగ్ గ్లాసులు వేసేస్తాను. దానికి కారణం ఏంటంటే ఎవరైనా ఆడవాళ్లు కలలోకి చూస్తే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వారి కళ్ళలోకి సూటిగా చూడలేరు. అందుకే అలా కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని” అని వెల్లడించారు.
Advertisement
చెన్నైలో 8వ శతాబ్దంలో నిర్మించిన మీసాల కృష్ణుడి దేవాలయంలో ఓ పాట షూటింగ్ పూర్తిచేసుకుని కృష్ణ, విజయనిర్మల బయటికి వచ్చారట. అప్పుడు అక్కడ ఉన్న కమెడియన్ రాజాబాబు “ఇది చాలా పవర్ఫుల్ గుడి. ఇక్కడ షూటింగ్ పెళ్లి చేసుకున్న వాళ్లంతా నిజంగా పెళ్లి చేసుకున్నారు” అని జోస్యం చెప్పాడట. చివరికి తమ విషయంలోనూ ఆ జోస్యం నిజమైందని విజయనిర్మల ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. కాగా.. 2022లో మహేష్ బాబు కుటుంబంలో ఏకంగా ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.
READ ALSO : T20 WC 2022 : టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్