Advertisement
తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది సావిత్రి పేరు లేకుండా మొదలుకాదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ మహానటి ఎవరంటే సావిత్రి పేరే చెబుతారు. పురుషాదిక్యం మెండుగా ఉన్న మొదటి రోజులలో హీరోలకు దీటుగా ఆమె స్టార్ డమ్ ను సంపాదించారు. కళ్ళతో నటించే సావిత్రి తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినా.. భారతదేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టేవారు. ఆమె కాల్ షీట్లు దొరక్కపోతే సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న స్టార్ హీరోలు కూడా ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ సూపర్ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సావిత్రి.
Advertisement
Read also: వివాదంలో ‘వీర సింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోలు అందరి సరసన నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినిల్లు అయితే తమిళ చిత్ర పరిశ్రమ మెట్టినిల్లు అని సావిత్రి అనేవారు. బాలీవుడ్ లో సైతం ఆమె చెరగని ముద్ర వేసింది. అయితే సావిత్రి జీవితం ఎంత గొప్పగా వెలిగిపోయిందో చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించారని ఇండస్ట్రీ టాక్. కానీ ఆమె చనిపోయే ముందు అందరూ అనుకునేంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించలేదని కుటుంబ సభ్యులు చెబుతారు. సావిత్రి చనిపోయే నాటికి ఆమెకు సినీ ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సహాయం కానీ, సానుభూతి కానీ లభించలేదని ఫిలింనగర్ వర్గాల్లో టాక్. దీనికి గల కారణం సావిత్రి మొండివైఖరి అంటారు.
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజనులు ఎన్టీఆర్, ఏఎన్నార్లు సావిత్రికి ఎన్నోసార్లు ఆమె వ్యసనాలు మానివేయాలని, ఆరోగ్యానికి కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. కానీ ఆమె తన మొండి వైఖరితో వారి మాటలు వినకపోవడం వల్లనే చివరి రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదని ఫిలింనగర్ వర్గాల్లో టాక్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాత్రమే కాదు.. ఆమె సహనటీమణులు కూడా సావిత్రి కి వ్యసనాలు మానివేయాలని ఎంతో చెప్పి చూశారట. కానీ ఎవరి మాటలు వినకపోవడంతో చనిపోయే ముందు ఎవరూ రాలేదని, కనీసం చూడలేదని అంటారు. ఆమె తన మండివైఖరిని ఏమాత్రం మానుకోకపోవడంతో చివరి రోజులలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు కూడా ఆమెను పట్టించుకోలేదని తెలుస్తోంది.
Read also: సంక్రాంతి బరిలో విడుదలై డిజాస్టర్లు గా మిగిలిన సినిమాలు ఏవంటే ?