Advertisement
సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 14వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలు ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో అశేష అభిమానులు, ప్రజానీకం మధ్య జరిగాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూసిన రోజు నుంచి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కి సంబంధించిన మరొక అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Read also: పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?
కృష్ణ విజయనిర్మల చనిపోయిన తర్వాత కన్న కొడుకు మహేష్ బాబును సైతం కాదనుకొని తనతో ఎలాంటి బంధం లేని నరేష్ కుటుంబంతో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. అయితే ఇదే విషయాన్ని ఓ సమయంలో “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో కృష్ణ దీనికి సమాధానం ఇచ్చారు. ప్రముఖ నటుడు నరేష్ విజయనిర్మల కొడుకు. విజయనిర్మలకి నరేష్ మొదటి భర్త వలన కలిగిన సంతానం. అయితే కృష్ణ – విజయనిర్మలకి అప్పటికే విడివిడిగా సంతానం ఉండడం చేత వీళ్ళిద్దరూ సంతానం వద్దనుకున్నారు. కాగా విజయనిర్మల గుండెపోటుతో జూన్ 27, 2019 న కన్ను మూసిన విషయం తెలిసిందే.
Advertisement
అయితే.. విజయనిర్మల కన్నుమూసిన తర్వాత కృష్ణ నరేష్ కుటుంబంతో కలిసి ఉండడానికి గల కారణం నరేష్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృష్ణ. అంతేకాదు కృష్ణ కి ఎలాంటి అవసరం వచ్చినా నరేష్ అది క్షణాలలో చేసి పెట్టే వారిని తెలిపారు. ఏదైనా అవసరం నిమిత్తం కృష్ణ ఫోన్ చేయగానే నరేష్ పరిగెత్తుకుంటూ వస్తాడని తెలిపారు. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ అయినందువల్ల చాలా బిజీగా ఉంటాడు కాబట్టి.. అతనికి సంబంధించిన పనులను అన్ని నమ్రత చూసుకుంటూ ఉంటుందని, అలా తాను నమ్రత కి భారంగా ఉండలేకపోయాడు అనేది వినిపిస్తున్న మాట.
Also Read: వేదం సినిమాలో కర్పూరం రోల్ చేయాల్సింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!