Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే జైలర్ మూవీ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో సూపర్ రజినీకాంత్ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిమాలయాల నుంచి తన పర్యటన షురు చేశారు తలైవా.. ఇక తరువాత ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు.
Advertisement
ఇటీవల ఝర్ఖండ్ సీఎంతో కలిసి రాంచీలో చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి జైలర్ సినిమా చూశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన రజినీకాంత్.. ఆ సమయంలో యోగికి పాదాభివందనం కూడా చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై పెద్ద ఎత్తు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Advertisement
రజినీ చేసిన పని చూసి.. ముఖ్యంగా తమిళ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. తలైవా.. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. “యోగి, సన్యాసీల పాదాలను తాకి, వారి ఆశ్వీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నా కంటే చిన్నవారు అయినప్పటికీ కూడా ఇలాగే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను” అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు.
Also Read :