Advertisement
చిక్కడపల్లిలోని హాస్టల్లో ఆ*త్మ*హ*త్య చేసుకున్న 23 ఏళ్ల మర్రి ప్రవల్లిక కొన్ని రోజుల తర్వాత ప్రవళ్లిక జీవితాన్ని నాశనం చేయడానికి అసలు కారణం అయిన వ్యక్తి గురించి ఆమె సోదరుడు మరియు తల్లి వివరించారు. ఇప్పటివరకు ఆమె కేసులో రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోవడానికి ముందు తన తండ్రితో గ్రూప్స్ 2 ఎగ్జామ్స్ గురించి బాధపడుతూ మాట్లాడింది. దాని గురించి తండ్రి తెలిపితే.. ఆ ఎగ్జామ్స్ వాయిదా పడడం వల్లే ప్రవల్లిక చనిపోయింది అంటూ నిరుద్యోగులు ధర్నాలు చేసారు. దీనితో ఈ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది.
Advertisement
ఆ తరువాత పోలీసులు రంగంలోకి దిగి ఇది పరీక్షకి సంబంధించిన విషయం కాదని.. ఆమె లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయింది అంటూ డిక్లేర్ చేసారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ పేర్కొన్నారు. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ రెండు కాదు అని ఆమె సోదరుడు తల్లి చెబుతున్నారు. శివరాం అనే ఓ వ్యక్తి ప్రవల్లికను వేధించాడని, ఫోన్స్ చేసి విసిగించాడని ఆమె తల్లి చెబుతోంది. అతని వేధింపులు భరించలేకే ఇలాంటి పని చేసిందని బాధ పడుతోంది.
Advertisement
ఇక ఆమె సోదరుడు మాట్లాడుతూ.. అక్క నేను హాస్టల్ లోనే ఉంటూ చదువుకునే వాళ్ళం అని చెప్పాడు. ఓ ఫ్రెండ్ ద్వారా అక్కకి శివరాం తో పరిచయం అయ్యిందని, అప్పటి నుంచి అక్కకి శివరాం నుంచి వేధింపులు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు. ఫోన్స్ ఎత్తకపోతే వేరే వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేసి విసిగించేవాడని, అమ్మ వాళ్ళకి చెప్పుకోలేక తనలోనే చాలా మధనపడిందని సోదరుడు చెప్పుకొచ్చాడు. ఆ వేదన భరించలేకే అక్క మాకు దూరం అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీరిద్దరూ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని..
Kalonji Seeds In Telugu: కలోంజీ సీడ్స్ అంటే ఏమిటి? వీటి వలన కలిగే ఉపయోగాలు ఏమిటి?
హిందూ సంస్కృతిని గర్వంగా పాటిస్తున్న ఫారిన్ క్రికెటర్స్.. ఎవరెవరో చూడండి!