Advertisement
సాధారణంగా దేశంలో చాలావరకు అక్షయ తృతీయ రోజు వచ్చిందంటే ప్రజలంతా బంగారం షాపుల ముందు బారులు తీరుతారు.ఆ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు. దాని వెనుక ఉన్న కారణం ఏంటి.. ఓ సారి తెలుసుకుందాం..? అక్షయ తృతీయ అనే వైశాఖ శుద్ధ తదియ రోజు కృత యోగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Advertisement
ఈ తృతీయ రోజున శ్రీ విష్ణువు పరశురామ అవతారాన్ని ధరించారని నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా ఏ శుభకార్యమైనా జరుపుకోవచ్చు అని పురోహితులు అంటున్నారు. అలాగే బద్రీనాథ్ లోని ఆలయాన్ని కూడా ఈ రోజు తెరుస్తారు. ఇలా అన్ని రకాలుగా మంచి జరిగే ఈ రోజు అక్షయ తృతీయ అంటారు.
Advertisement
అక్షయ తృతీయ అని పేరు ఏ విధంగా వచ్చిందంటే మహావిష్ణువు పరశురాముడి గా అవతారమెత్తాడు కాబట్టి ఈరోజు మనం ఏది చేసినా ప్రాఛీయంగా మిగిలిపోతుందని చెబుతారు. ముఖ్యంగా ఈ రోజు ఎటువంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం అనేది శాశ్వతం గా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం ముగించుకొని ముందుగా శ్రీమహావిష్ణువు పాదాలపైన అక్షింతలతో పూజ చేయాలి.
తర్వాత బియ్యాన్ని మిగిలినవి జాగ్రత్తగా ఏరి దానమివ్వాలి. మిగిలిన కొన్ని బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి. అయితే అక్షయ తృతీయ రోజు మనం ఏది కొన్నా అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అందుకే లక్ష్మీస్వరూపమైన బంగారాన్ని ఎక్కువగా కొంటారు. ఈ రోజు కేవలం బంగారం కొనడమే కాదు ఏది కొన్నా అది రెట్టింపు అవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి.