Advertisement
ఒక పిల్లాడు తన షాపును కాపాడుకోవడం కోసం చూపించిన తపన మామూలుగా లేదు. ప్రస్తుతం పిల్లాడు చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బాలుడు చేసిన ఘనతను మంత్రి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అదేంటో చూద్దామా.. నాగాలాండ్ టూరిజం ఉన్నత విద్యాశాఖ మంత్రి తెంజాన్ ఇమ్నా ఆలోచన రేకెత్తించే వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
Advertisement
ఒక బాలుడు తన షాపును కాపాడుకోవడం కోసం కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో నేటిజన్లను ఆకట్టుకుంటుంది. తుఫాను తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. తుఫాన్ టైంలో తల్లికి షాపును కాపాడడంలో బాలుడు సాయం చేస్తుండడం కనిపిస్తోంది. గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో దాన్ని తీసుకువచ్చేందుకు బాలుడు పరిగెత్తడం. వయసుకు మించిన బాధ్యత తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది.
जिम्मेदारी समझने के लिए उम्र कि जरूरत नहीं, हालात ही सीखा देता हैं! pic.twitter.com/VdGu5saDS8
Advertisement
— Temjen Imna Along(Modi Ka Parivar) (@AlongImna) May 18, 2023
వయసులో చిన్నగా ఉన్న పరిస్థితులు బాధ్యతలను నేర్పుతాయని ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు మంత్రి. బాలుడ్ని ట్విట్టర్ యూజర్లు ప్రశంసలతో ముంచేస్తున్నారు. చిన్న వయసులోని బాలుడు చాలా పరిపక్వతతో వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ ఒక యూజర్ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: