Advertisement
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 05 నుంచి నవంబర్ 19 వరకు దాదాపు 10 వేదికల్లో ఈ టోర్నీ జరుగనుంది. ఈసారి ప్రపంచకప్ భారత్ లో జరుగుతుండటంతో టీమిండియా హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగనుంది. 2011 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్.. 2015 లో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో, 2019 సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది భారత జట్టు.
Advertisement
ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎలా ఉండాలి అనే అంశంపై భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కీలక వ్యాఖ్యలు చేసాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో గంభీర్, యువరాజ్ సింగ్ తో పాటు సురేష్ రైనా రూపంలో ముగ్గురు లెప్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారని.. ప్రస్తుత జట్టులో టాప్ ఆర్డర్ లో ఆడగలిగే లెప్ట్ హ్యాండర్ ఒక్కరూ కూడా లేరని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంల గాయపడటంతో మిడిలార్డర్ లో ఉన్న లెప్టాండర్ దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ జట్టులో ఉన్నా.. కే.ఎల్.రాహుల్ కి బ్యాకప్ మాతరమే ఉంటున్నాడు. రవీంద్ర జడేజా ఉన్నా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తాడు అని గుర్తు చేశాడు. ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా కప్ గెలవాలంటే టాప్ 3 లో ఒక లెప్టాండర్ తప్పనిసరిగా ఉండాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సూచనలు చేశారు.
Advertisement
భారత జట్టుకు లెప్ట్ హ్యాండర్స్ సమస్య తీరాలంటే.. యువ ఆటగాళ్లు అయిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ లను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. టీమిండియా టాప్ ఆర్డర్ లో లెప్టాండర్ లేకపోవడం పెద్ద సవాల్ గానే మారనుంది. ఓపెనింగ్ జోడీలో లేకపోయినప్పటికీ టాప్ 4లో ఒక లెప్టాండర్ ఉండటం చాలా ఉత్తమం. టాప్ 6లో ఇద్దరు లెప్టాండర్స్ ఉంటే చాలా మంచిది అని రవిశాస్త్రి వెల్లడించారు. అక్టోబర్ 08న చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే పోరుతో టీమిండియా టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఆ తరువాత 11న అప్గానిస్తాన్ తో ఆడనుంది. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ప్రతీ ఒక్కరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ప్రపంచ ఛాంపియన్ షిప్ ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈసారి హైదరాబాద్‌లో మూడే మ్యాచ్లు, 2 పాకిస్తాన్‌వే.. ఎందుకు వరల్డ్ కప్ మ్యాచులు పెట్టలేదు అంటే..?