Advertisement
ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వచ్చి విడిపోతున్నారు. హాయిగా ఉన్న జంట కూడా ఒక్కసారిగా విడాకులు తీసుకోవడం విడిపోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెలబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు చిన్న విషయానికి కూడా విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు సాధారణంగా ఎవరైనా సరే తన పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు కానీ ఈమె మాత్రం విడాకుల్ని కూడా గ్రాండ్ గా జరుపుకుంది. ఇదివరకు అయితే పెళ్లి పెట్టకుండాకి వెళ్లిపోవడం రోజు ఏడుస్తూ కూర్చోవడం వంటివి చేసేవారు కానీ పాకిస్తాన్ కి చెందిన ఒక మహిళ మాత్రం విడాకుల పార్టీ చేసుకుంది.
Advertisement
భర్తతో విడిపోయాక ఆమె గ్రాండ్ గా పార్టీ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ డివోర్స్ సెలబ్రేషన్స్ లో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో సమాజంలో విడాకుల గురించి ఉన్న ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ఈమె ఒక లెహంగా వేసుకుని ఫేమస్ బాలీవుడ్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తుండగా ఆమె స్నేహితులు ఆమెను ప్రోత్సహిస్తూ ఆమెపై నోట్ల వర్షం కురిపించారు.
Advertisement
Divorce party……….. 😂#viralvideo pic.twitter.com/BoOownCZq7
— Haris Raza (@IM_HarisRaza) July 25, 2024
Also read:
విడాకులు పొందినందుకు శుభాకాంక్షలు అని అర్ధం వచ్చేలా బెలూన్స్ కూడా అంటించారు. ఈ వీడియో అమెరికాలో షూట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఆ మహిళ అమెరికాలో ఒక దుకాణం నడుపుతోంది. తన భర్తతో ఎందుకు విడిపోయిందో చెప్పలేదు ఈ వీడియో మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. ఏంటి విడాకులని కూడా ఇలా జరుపుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!