Advertisement
పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా తొలిప్రేమ అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో యూత్ కి ఎంతో కనెక్ట్ అయిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అమాయక ప్రేమికుడి పాత్రలో తన ప్రేమ విషయం అమ్మాయికి చెప్పడంలో మొహమాటపడే నటనతో పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్ కీర్తి రెడ్డి నటన మామూలుగా లేదు. అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకుందని చెప్పవచ్చు.
Advertisement
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమైంది కీర్తి రెడ్డి.. మరి ఆ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. తొలిప్రేమ మూవీ వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తొలిప్రేమ మూవీ తర్వాత తెలుగు,హిందీ, తమిళ్ లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తి రెడ్డి అక్కినేని హీరో సుమంతుని వివాహం చేసుకుంది.
Advertisement
ఆ తర్వాత మనస్పర్ధలతో ఇద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి సినిమాలకు పూర్తిగా దూరమైంది. దీని తర్వాత ఎన్నారై ని రెండో పెళ్లి చేసుకున్న కీర్తి, ప్రస్తుతం తన భర్తతో అమెరికాలో ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఇటీవల ఇండియాలో జరిగిన బంధువుల ఫంక్షన్ కు వచ్చి సమంత స్నేహితురాలు అయిన ఫిట్నెస్ ట్రైనల్ శిల్పారెడ్డితో కలిసి ఫోటో దిగి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ విధంగా కీర్తి రెడ్డి ఫోటో బయటకు రావడంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కీర్తి అందం ఏ మాత్రం తగ్గ లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
also read: ఆ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే..ఆ అబ్బాయి జీవితం డబ్బు మయమే !