Advertisement
సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి లక్షణాలు మరియు ప్రవర్తన గురించి చెప్పడం జరుగుతుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం కూడా వీటిని కనుక్కోవచ్చు, జ్యోతిష్య శాస్త్రంలో రాశి చక్రాల గుర్తులు ప్రకారం ఎలా అయితే అంచనా వేస్తారో న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్య బట్టి మనుషుల లక్షణాలు మరియు ప్రవర్తనలు అంచనా వేయడం జరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా ఆరవ తేదీన జన్మించిన అమ్మాయిలకు లక్ష్మీదేవి కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వారి స్వభావం ఎంతో సున్నితంగా మరియు సరళంగా ఉంటుంది. చాలా ప్రతిభావంతులై మరియు తెలివైన విధంగా నడుచుకుంటారు. సంగీతం వంటి రంగాలలో చాలా ఇష్టంగా ముందుకు వెళ్తారు. వీరి స్వభావం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
Advertisement
Advertisement
ఏ నెలలో అయినా 15 వ తేదీన పుట్టిన అమ్మాయిలకు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఉంటుందనే చెప్పవచ్చు. ఈ తేదీన పుట్టిన వారు ఎంతో కష్టపడి పని చేస్తారు, అంతా తేలికగా ఏది దక్కదు అయినా సరే ఎంతో కష్టపడతారు. ఎప్పుడు కూడా డబ్బు కొరతను అస్సలు ఎదుర్కోరు. శుక్రుడు అనుగ్రహం ఎంతో ఉంటుంది, దాంతో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.
ఏ నెలలో అయినా 24వ తేదీన పుట్టిన అమ్మాయిలకు ఎంతో అదృష్టం ఉంది అని చెప్పవచ్చు. వీరి వ్యక్తిత్వం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి మాటలు కూడా చాలా మధురంగా ఉంటుంది. ఈ తేదీన పుట్టిన వారికి కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉండడం వలన జీవితంలో ఎప్పుడూ సుఖాలు సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!