Advertisement
మాథ్యూస్ రెండు నిమిషాల్లో ముందు వికెట్ కోసం స్ట్రైక్ చేయడం లో విఫలం అయ్యాడు. అందుకే అతను మ్యాచ్ నుంచి “టైం అవుట్” అయ్యాడు. ఈ ఆన్-ఫీల్డ్ డ్రామా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువ అయ్యాయి. అసలు ‘టైం అవుట్’ అవుట్ అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ బంగ్లాదేశ్‌తో తన జట్టు ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ పోరులో అంతర్జాతీయ మ్యాచ్‌లో “టైమ్ అవుట్” అయిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. రూల్స్ ప్రకారం చివరి బ్యాటర్‌ను అవుట్ చేసినప్పటి నుండి రెండు నిమిషాల నిర్ణీత సమయంలో బౌలర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో బ్యాటర్ ప్రకటించలేకపోతే.. అతను టైమ్డ్ ఔట్ అయ్యాడు అని చెబుతుంటారు.
Advertisement
అయితే.. ఇలా గతంలో కూడా జరిగింది. ప్రపంచ కప్ పోరులో జరగడం ఇది తొలిసారి అయినప్పటికీ.. ఇతర మ్యాచ్ లలో ఇలా ముందే జరిగింది. 1877లో తొలిసారిగా ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం జరిగింది. మొదటి సారి క్లీన్ బౌల్డ్ అవ్వడం కూడా ఇదే ఏడాది జరిగింది. రిటైర్డ్ హర్ట్‌గా ఓ ఆటగాడు వెనుదిరగడం కూడా ఇదే ఏడాది జరిగిందట. రనౌట్, ఎల్బీడబ్ల్యూ, స్టంపింగ్ లాంటి ఘటనలు తొలిసారిగా ఇదే ఏడాది చోటు చేసుకున్నాయి. 1884లో మొట్టమొదటిసారిగా హిట్ వికెట్ ఘటన చోటు చేసుకుంది.
Advertisement
అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ వలన 1951లో ఓ ఆటగాడు పెవిలియన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా ఫీల్డర్ ను అడ్డుకుంటే అంపైర్లు అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ ఎవరైనా బ్యాటర్ బంతిని చేత్తో పట్టుకుంటే హ్యాండ్లింగ్ బాల్ ఔట్ అంటారు. ఇటువంటి ఘటన 1957 లో చోటు చేసుకుంది. ఒకే బాల్ ని రెండు సార్లు కొట్టినా అవుట్ చేస్తారు. ఇది 2023 లో చోటు చేసుకుంది. తాజాగా… టైం అవుట్ అయ్యి అవుట్ అయిన ప్లేయర్ గా ఏంజెలో మ్యాథ్యూస్ రికార్డులలో నిలిచాడు.
Read More:
Indian Cricket Team: మొన్నటిదాకా విలన్.. ఇప్పుడేమో హీరో.. టీం ఇండియా సక్సెస్ వెనుక అసలు కారణం ఇతనే!
క్రికెట్ లో “టైం అవుట్” అంటే ఏమిటి? మాథ్యూస్ ఎందుకు మ్యాచ్ నుంచి డిస్మిస్ అయ్యాడు?
ఈగ సినిమాలో ఇది గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రాజమౌళి గారు?