Advertisement
తిరుమల శ్రీవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే అత్యంత ధనవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి. నిత్యం శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో జనాలు వస్తారు. జనాలతో పాటు… కోట్లల్లో హుండీ ఆదాయం కూడా చేకూరు తోంది. మొన్న కరోనా సమయంలోను… ఎక్కడ తగ్గకుండా జనాలు విపరీతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని వారి మొక్కులు అప్పజెప్పారు.
Advertisement
Read also: పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!
శ్రీవారి దేవాలయం ఒక తిరుమలలో కాకుండా… దేశ నలుమూలల విస్తరిస్తోంది. ప్రముఖ పట్టణాలలో శ్రీవారి దేవాలయాలను టీటీడీ నిర్మిస్తోంది. ఇదంతా పక్కకు పెడితే.. శ్రీవారికి అనేక పేర్లు ఉన్నాయి. అయితే వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట.
Advertisement
Read also: RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్
అయితే లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ తరుణంలోనే కుబేరుడు… శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెళ్లికి అయ్యే ఖర్చును మొత్తం ఇచ్చాడట. ఒక సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చకుండా… వడ్డీ కడతాడట. అప్పటినుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి, పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుంది. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే శ్రీవారికి వడ్డీ కాసుల వాడని పేరు వచ్చింది.