Advertisement
చాలామంది ఇండ్లలో ముందుగానే బియ్యాన్ని కొనుక్కొని, లేదంటే పండించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేసిన రైస్ ఒక్కోసారి పురుగుల బారిన పడుతూ ఉంటుంది. కనీసం తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి. అలా బియ్యం పాడవకుండా ఉండాలి అంటే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురుగులు పట్టిన బియ్యాన్ని వండుకోవాలంటే చాలా కష్టం. వాటిని శుభ్రం చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది.
Advertisement
Also Read: దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
Also Read: చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?
Advertisement
గ్రామాలలో అయితే బియ్యాన్ని ఎండలో పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సిటీలో ఎండబెట్టడం కుదరదు. అలాంటివారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే బియ్యం పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. వంటకాలలో మంచి రుచి కోసం ఉపయోగించే ఇంగువ బియ్యంలో పురుగులు పట్టకుండా కాపాడుతుంది. ఇంగువకు ఉన్న ఘాటైన వాసనకి బియ్యానికి పురుగు పట్టకుండా చేస్తుంది. ఇంగువను ఒక వస్త్రంలో ఉంచి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి. అలా చేయడం వల్ల బియ్యంలో ఉన్న తేమను కూడా తగ్గిస్తుంది.
తేమ కారణంగా కూడా బియ్యం పురుగు పడతాయి. సాధారణంగా చాలామంది బియ్యం పురుగు పట్టకుండా వేపాకు ఉపయోగిస్తారు. వేపాకులో ఉండే క్రిమినాశక లక్షణాలు బియ్యానికి పురుగు పట్టకుండా చేస్తూ ఉంటాయి. బియ్యంలో వేపాకు రెబ్బలను ఎండబెట్టి వేసుకోవచ్చు. అలాగే వేపాకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని ఆ పొడిని వస్త్రంలో ముటకట్టి చిన్న చిన్న మూటలుగా చేసి కట్టిబియ్యంలో అక్కడక్కడ వేయాలి. ఇలా చేయడం వలన కూడా బియ్యంలో తెల్ల పురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా పోయి కొన్ని నెలల పాటు ఫ్రెష్ గా ఉంటాయి..
also read:మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!