Advertisement
ప్రస్తుత కాలంలో కోట్లాదిమందికి అధిక బరువు అనేది అతిపెద్ద శత్రువుగా మారుతుంది. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలాగే ఇరుగుపొరుగు వారు బాడీ షేమింగ్ కామెంట్స్ వేదనకు గురి చేస్తూ ఉంటాయి. దీంతో చాలామంది బరువు తగ్గించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. మరి ఇలాంటి జాబితాలో మీరు ఉన్నారా.. అయితే మీకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇలాంటి కొబ్బరి నీళ్లు తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Advertisement
ముందుగా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకొని అందులో టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి పది నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత కొబ్బరి నీళ్లను డైరెక్ట్ గా తాగాలి. చియా సీడ్స్ మరియు లెమన్ జ్యూస్ కలిపిన కొబ్బరి నీళ్లను రోజుకోసారి తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.
కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొబ్బరినీళ్లు పైన చెప్పిన విధంగా తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రోజంతా ఎనేర్జిటిక్ గా,యాక్టివ్ గా ఉంటారట . అంతేకాకుండా ఒత్తిడి ఆందోళన దూరమై పొట్ట కొవ్వు తగ్గిపోతుంది. అలాగే రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుందని నీరసం అలసట వంటివి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
also read: