Advertisement
ఈరోజు వాతావరణం 26.04.2023:తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తాజాగా తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణంలో నెలకొన్న అనిషితి, ద్రోని ప్రభావంతో వర్షాలు పడతాయని వెల్లడించింది.
Advertisement
ఈరోజు వాతావరణం తెలంగాణ, ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…!: Todays Weather in Andhra and Telangana
Read also: విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు ఏరోప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచాలి ? లేకుంటే ఏమి జరగుతుంది ?
బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే పంట దెబ్బ తినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. హైదరాబాదులో కురిసిన కుండబోత వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Advertisement
నేటి వాతావరణం 26.04.2023 ఆంధ్ర & తెలంగాణ
ఇక హైదరాబాద్ నగరంలోని పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, కార్వాన్ లో మళ్లీ మొదలైంది వర్షం. దీంతో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక అటు ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వడ మీదుగా కర్ణాటక వరకు ద్రోని విస్తరించిందని తెలిపారు. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడ్డాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
Read also: మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?