Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో గొప్ప నైనది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చాలామంది డాక్టర్ చదువులు చదివి, యాక్టర్లుగా మారారు. మరి కొంతమంది మాత్రం ప్రాక్టీస్ చేస్తూనే టైం దొరికినప్పుడు యాక్టర్ గా చేస్తూ వస్తున్నారు. మరికొంతమంది మాత్రం డాక్టర్ చదువులను మధ్యలోనే ఆపేసి యాక్టర్ల అవతారం ఎత్తారు.
Advertisement
సాయి పల్లవి హీరోయిన్ గా సౌత్ లో ఎంత మంచి స్టార్ డమ్ సంపాదించిందో అందరికీ తెలుసు. డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ, ఫిల్మ్ కెరీర్ ను చూసుకుంటూనే, తన ఎంబిబిఎస్ ను కంప్లీట్ చేసింది. పేదవారి డాక్టర్ గా పేరు తెచ్చుకుంటా అంటుంది సాయి పల్లవి. సినిమాల విషయంలో కూడా సెలెక్టివ్ గా వెళ్తున్న సాయి పల్లవి, స్టార్ హీరో అని చూడకుండా తన పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి సినిమా చేస్తుంది.
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!
Advertisement
మరోవైపు యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆజ్మీల్ అమీర్ కూడా మెడిసిన్ చదివిన వ్యక్తి. రచ్చ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కంట్లో పడిన ఈ యంగ్ స్టార్ రంగం సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు.
తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన అల్లు రామలింగయ్య కూడా డాక్టరే. కానీ ఆయన ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. తెలుగు చిత్ర పరిశ్రమలోని మరో లెజెండ్రీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా డాక్టరే. ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసి కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమాలపై ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నారట.