Advertisement
Tollywood Heros Remunerations 2022: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించి తెలుగువారి స్టామినా ఏంటో విశ్వవ్యాప్తం చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇదే అదునుగా మన హీరోలు తమ రెమ్యూనరేషన్ ని కూడా అమాంతం పెంచేశారు. ఒకప్పుడు మన టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ 10 కోట్ల నుంచి 15 కోట్లకు మించి ఉండేది కాదు. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ రేంజ్ ఎదిగిపోవడంతో మన హీరోల రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. ఈ సందర్భంగా 2022లో అత్యధిక పారితోషికం పొందిన టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తెలుసుకుందాం..
Advertisement
Read also: సినిమాల్లోకి వచ్చాక పేరుమార్చుకున్న హీరోయిన్లు అసలు పేర్లు ఏంటంటే..?
1) ప్రభాస్.
ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ సినిమాకి 100 నుండి 130 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
2) రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏడాది విడుదలైన ఆచార్య, RRR సినిమాలకి ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
3) మహేష్ బాబు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది విడుదలైన సర్కారు వారి పాట సినిమాకి 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
4) జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది విడుదలైన RRR చిత్రానికి 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
5) మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది విడుదలైన ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలకు 80 నుంచి 100 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
6) పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది విడుదలైన భీమ్లా నాయక్ సినిమాకి 20 నుంచి 100 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
7) అల్లు అర్జున్.
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి అల్లు అర్జున్ 80 నుంచి 100 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
8) రవితేజ.
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ, 60 నుంచి 80 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
9) నాని.
నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది విడుదలైన అంటే సుందరానికి సినిమాకి 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
10) బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్రానికి బాలకృష్ణ 40 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.