Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి. అయితే ముఖ్యంగా… ప్రేమ వివాహం చేసుకొని… వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో.. వారెవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
జయప్రద: తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్లయి, పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద
శ్రీదేవి: అందాల తార శ్రీదేవి రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
Advertisement
sridevi and bony kapoor
శ్రియా శరణ్: ప్రేమ, పెళ్లి, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చారు శ్రియా శరణ్. రష్యా కి చెందిన ఆండ్రీ koscheev ని ప్రేమించిన విషయం గానీ, పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
Shriya Saran marriage
రమ్యకృష్ణ: నవరసాలను అద్భుతంగా పలకరించే నేటి తరం నటీమణుల్లో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తో ఉన్న పరిచయం, ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.
ALSO READ;
అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?