Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
Advertisement
ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్ల తొలి సినిమాల గురించి తెలుసుకుందాం.
#1 కాజల్ – చందమామ నుండి మహాలక్ష్మి:
చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది. చిన్ని ఫేస్ తో, లంగా వోణీలో, హీరోని అరుస్తూ, ఏడిపిస్తూ, ఎమోషనల్ సీన్స్ లో కూడా బెస్ట్ ఇచ్చింది. అప్పటి యువత కింద, మేడ పడిపోయారు. లక్ష్మీ కళ్యాణం లో కూడా తొలగింటి అమ్మాయిలా భలే ఉంటుంది.
#2. లావణ్య – అందాల రాక్షసి నుండి మిధున:
లావణ్య, అందాల రాక్షసి నుండి మనకు మిధున గా మాత్రమే తెలుసు. ఆ కుర్తీలు, దుపట్టా, వన్ సైడ్ వేసుకోవడం, లూస్ హెయిర్ లేదా లూజ్ జడ, నిలువు బొట్టు, కుంకుమ పెట్టుకుని ఇలాంటి పాత్ర ఎప్పటికీ, ఇంకెప్పటికీ రాదు.
#3 అనుష్క- సూపర్ నుండి సాషా:
సూపర్ నుండి ఇప్పటివరకు అనుష్క టాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయిస్తుంది. బాహుబలి సినిమాతో క్రేజ్ మరింత పెంచుకుంది.
#4 తమన్నా – హ్యాపీ డేస్ నుంచి మధు :
తమన్నా ఎన్ని సినిమాలు చేసిన హ్యాపీడేస్ మా ఎప్పుడు ప్రత్యేకమే. అది శేఖర్ కమ్ముల గారి వల్ల ఇంకాస్త అందంగా అనిపిస్తోంది. చీర, స్కర్ట్, కుర్తి, టి షర్టు అన్నిట్లో క్యూట్ గా ఉంటుంది.
#5 పూజా హెగ్డే -ముకుంద నుండి గోపిక:
Advertisement
పూజా హెగ్డే ఇప్పటికీ ప్రత్యేక పాత్రలు చాలా ఉన్నాయి. కానీ, ముకుందా ఎప్పుడు ఆల్ టైం ఫేవరేట్. సినిమా మొత్తం లాంగ్ స్కర్ట్స్ తో చాలా సింపుల్ గా ఉంటుంది.
#6 రాశి కన్నా – ఊహలు గుసగుసలాడే నుండి ప్రభావతి :
రాశి కన్నా, ఊహలు గుసగుసలాడే లో తెల్లటి డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ప్రభావతి గెటప్ లో కనిపించింది.
#7 మెహరిన్ – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ నుండి మహాలక్ష్మి:
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లో చాలా సింపుల్ గా ఉంటుంది. కాటన్ చుడీదార్లు, పటియాల, కాటుక, గజిబిజి జడ, సరైన మధ్యతరగతి అమ్మాయిల కనిపిస్తోంది.
#8 రెజీనా – రొటీన్ లవ్ స్టోరీ నుండి తన్వి:
ఈ సినిమాలో రెజీనా అయితే ప్లేయిన్ చీరలు, స్లీవ్ లెస్ టాప్స్, స్కార్ఫ్స్ లో సూపర్ కూల్ ఉంటుంది.
#9. సమంత – ఏ మాయ చేసావే నుండి జెస్సి :
సమంతకు క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో జెస్సీగా సమంత అందరిని అలరించింది. అది కూడా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ఫ్రాక్ మరియు హిందూ స్టైల్ గ్రీన్ చీర ఒకే పాటలో కనిపించింది.
#10. హన్సిక – దేశముదురుకు చెందిన వైశాలి:
ఇంత తెల్లగా ఇదేంట్రా బాబోయ్ అనుకున్నాం. సినిమా గురించి ఆరా తీస్తుంటే 16 ఏళ్లు అని తెలిసింది. సగం సినిమా కేవలం ఒకే ఒక్క కాస్ట్యూమ్ తో ఎంత క్యూట్ గా అనిపించిందో.
ఇవి కూడా చదవండి: ఇంట్లో ఇలాంటి కీడులు జరిగితే… చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థమట !