Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ ల హవా కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కథలో అవసరం లేకున్నా క్లైమాక్స్ లోను ఇంటర్వెల్ బ్యాంగ్ లోనో ఎక్కడో ఐటెం సాంగ్ చోపిస్తున్నారు. గతంలో అయితే ఐటెం సాంగ్ లకు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ల కన్నా ఐటెం భామలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే హీరోయిన్ సైతం ఐటం భామలుగా మారిపోతున్నారు. కాబట్టి ఐటమ్ సాంగ్ లని నమ్ముకున్న వారు బలైపోతున్నారు. అయితే టాలీవుడ్ లో కొంతమంది హీరోలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన నటీమణులను సైతం వివాహాలు చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?
డేరింగ్ స్టార్ శ్రీహరి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసే డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీహరి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, శ్రీహరి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు హీరోగా కూడా పరిచయమయ్యాడు.
Advertisement
అదేవిధంగా ఒక అప్పటి హీరో మరియు విలన్ జెడి చక్రవర్తి సైతం రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేసిన అనుకృతిని పెళ్లి చేసుకున్నాడు. జెడి చక్రవర్తి లేటు వయసులో వివాహం చేసుకోగా తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ఐటమ్స్ పాటకు సమంత స్టెప్పులు వేయగా, ఆ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే సమంత మాత్రం చైతుతో విడాకుల తర్వాత ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసింది.
READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?