Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పరిశ్రమ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. 40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే. అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర చేయడం అంటే మరింత వింతగానే చెప్పుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏ. ఎన్.ఆర్ వంటి స్టార్ హీరోలు ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే తర్వాత మాత్రం కొంతమంది హీరోలే ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే ఆ హీరోలు చేసింది ఎక్కువ డ్యూయల్ రోల్స్, మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే.. ఆ సార్లు ఎవరో చూద్దాం.
Advertisement
#1 చిరంజీవి-స్నేహం కోసం
ఈ చిత్రంలో మెగాస్టార్ యాక్టింగ్ అదుర్స్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెగాస్టార్ జీవించేశారు.
Advertisement
#2 బాలకృష్ణ – పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి
ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. రెండు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్ కావడం మరో విశేషం.
#3 విక్టరీ వెంకటేష్ – సూర్యవంశం
ఈ చిత్రంలో హరిచంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేష్ జీవించారనే చెప్పాలి. అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
#4 మోహన్ బాబు- పేదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి
ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ కాస్త డైలాగ్ కింగ్ అవతారం ఎత్తాడు. మోహన్ బాబు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం. ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్ హైలెట్ అని చెప్పాలి. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు మోహన్ బాబు.
#5 రజనీకాంత్ – పేదరాయుడు, ముత్తు, నరసింహ
ఈ మూడు చిత్రాల్లోనూ మన సూపర్ స్టార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా, అద్భుతం అంతే!
#6 కమల్ హాసన్ – భారతీయుడు
ఈ యూనివర్సల్ హీరో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన, మనకి ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్ర మాత్రం ‘భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ మాత్రమే అనడంలో సందేహం లేదు.
also read; ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో.. ఎలా ఉందో చూడండి..!!