Advertisement
తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలు బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ నటులు పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది.. కాస్త ఈ మధ్య కాలంలో మాత్రం ఈ సంస్కృతి ఎక్కువ అయిందని చెప్పవచ్చు.. మొన్నటి వరకు సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. అది మరువకముందే, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి దూరమయ్యారు.
Advertisement
తాజాగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిన శ్రీను వైట్ల దంపతులు కూడా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. డైరెక్టర్ శ్రీనువైట్ల ఎన్నో సినిమాలు తీసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. స్టార్ హీరోల నుంచి మొదలు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల వరకు ఆయన చాలా మందితో జర్నీ చేశారు. ఆయన డైరెక్షన్ చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. కాని గత కొద్ది రోజుల నుంచి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.
Advertisement
శ్రీను వైట్ల భార్య రూప వైట్ల కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇద్దరు ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అంత తెలిసిపోతుంది. వారి మధ్య మనస్పర్థలు వచ్చి సమస్యలు పెద్దవి కావడం తో విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై శ్రీను వైట్ల దంపతులు క్లారిటీ ఇస్తే కానీ ఈ విడాకుల వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు.
ALSO READ:
టూత్ పిక్ వెనక భాగం ఎత్తయిన డిజైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?