Advertisement
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రికెట్ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యున్నతమైన క్రీడలలో క్రికెట్ ఒకటి. ఇందులో ఆడే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటారు. అలాంటి క్రికెట్ ఆటగాళ్లలో ఇండియన్ టీం తరఫున ఆడి ఎన్నో రికార్డులు సాధించిన కొంతమంది క్రికెటర్లు, ఒకప్పుడు గవర్నమెంటు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. అలాగే, కొంత మంది క్రికెటర్లు, బయట బిజినెస్ లు, ప్రకటనలు ఇస్తూ, భారీగానే సంపాదిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఎక్కువగా సంపాదించిన భారత క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# సచిన్ టెండూల్కర్ నికర విలువ – రూ.1120 కోట్లు
సచిన్ టెండూల్కర్ 2011లో అన్ని రకాల క్రికెట్ ల నుండి రిటైర్ అయ్యాడు. అయితే అతని బ్రాండ్ విలువ మార్కెట్లో అలాగే ఉంది. అతని మునుపటి సంపాదన మరియు ప్రస్తుతం ప్రకటనల ద్వారా సంపాదన, పెట్టుబడులతో అతను చాలా సంపాదిస్తున్నాడు.
# మహేంద్ర సింగ్ ధోని నికర విలువ – రూ.850 కోట్లు
ఎంఎస్ ధోని… సచిన్ తర్వాత అత్యంత ప్రజాదారణ పొందిన, అత్యంత ఆరాధించబడిన భారత క్రికెటర్. అతను సచిన్ స్థానంలో బూస్ట్, MRF వంటి టాప్ మోస్ట్ వాణిజ్య ప్రకటనలతో 100+ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.
# విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 700 కోట్లు
WROGN, BOOST, MRF వంటి అనేక బ్రాండ్లకు 50+ వాణిజ్య ప్రకటనలు & బ్రాండ్ అంబాసిడర్ తో విరాట్ కోహ్లీ… సచిన్ మరియు MSD తర్వాత టాప్ 3 ధనిక క్రికెటర్.
# సౌరవ్ గంగూలీ నికర విలువ – రూ.375 కోట్లు
Advertisement
బెంగాల్ టైగర్ & బిసిసిఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికీ 300+ కోట్ల నికర విలువతో 4వ స్థానంలో కొనసాగుతున్నారు.
# వీరేంద్ర సెహ్వాగ్ నికర విలువ – రూ. 334 కోట్లు
డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరు పాజి 300+ కోట్ల నికర విలువతో 5వ స్థానంలో ఉన్నాడు. వీరుకు ఢిల్లీలో అంతర్జాతీయ పాఠశాలలు మరియు క్రికెట్ అకాడమీ ఉన్నాయి.
# యువరాజ్ సింగ్ నికర విలువ – రూ.260 కోట్లు భారత క్రికెట్లో ఆల్ టైం
భారత క్రికెట్ లో ఆల్ టైం గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 250+ కోట్ల నికర విలువతో 6వ స్థానంలో ఉన్నాడు.
# సురేష్ రైనా నికర విలువ – రూ.185 కోట్లు
యువీ తర్వాత జాబితాలో ఉన్న మరో ఆల్ రౌండర్, ఈ ఆటగాడి నికర విలువ 180+ కోట్లు.
# రాహుల్ ద్రవిడ్ నికర విలువ – రూ.172 కోట్లు
ది వాల్, వెటరన్ ఇండియన్ క్రికెటర్ మరియు ప్రస్తుత భారత ప్రధాన కోచ్ నికర విలువ 170+ కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు.
# రోహిత్ శర్మ నికర విలువ – రూ.160 కోట్లు
ప్రస్తుతం భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ 160 కోట్లతో అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు.
# గౌతమ్ గంభీర్ నికర విలువ – రూ.150 కోట్లు
గౌతమ్ గంభీర్ సుమారు 150+ కోట్ల నికర విలువతో 10వ స్థానంలో ఉన్నాడు.
Also Read: బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?