Advertisement
పాటకు పరవశించని వారు ఎవరు కూడా ఉండరు అని చెప్పవచ్చు. పాటతో అనేక భావాలను వ్యక్తపరిచే శక్తి ఉంటుంది. అలాంటి పాటలు పాడడం అనేది ఒక కళ అని చెప్పవచ్చు. ఈ పాటల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. మాస్ పాటలు, మెలోడీ సాంగ్స్, జానపద గేయాలు ఇలా పలు రకాల పాటలు పాడారు.
Advertisement
ఏ సినిమా చూసిన అందులో పాటలు బాగుంటే సినిమా హిట్ అవుతుంది. ఇప్పటివరకు సినిమాల్లో ఎవర్గ్రీన్ పాటలు పాడి ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన సింగర్లు చాలామంది ఉన్నారు. వారిలో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో వారి గొంతుతో అందరినీ అలరించే పదిమంది సింగర్స్ గురించి తెలుసుకుందాం..?
1. ఎస్.పి.శైలజ భర్త సుధాకర్
ఎస్. పి.శైలజ,ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి. ఈమె కూడా సాగరసంగమం సినిమాలో నటించి తర్వాత సింగర్ గా సెటిల్ అయిపోయారు. దీని తర్వాత శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకుంది.
2. హేమచంద్ర-శ్రావణ భార్గవి కుటుంబం.
హేమచంద్ర శ్రావణ భార్గవి వారి టాలెంటుతో టీవీ షోలలో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరినీ పాటే కలిపింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి సింగర్స్ గా కొనసాగుతున్నారు.
3. మల్లికార్జున్ భార్య గోపిక కుటుంబం..
మల్లికార్జున్ మరియు పూర్ణిమ ఒకేసారి వారి కెరీర్ మొదలుపెట్టారు. జంటగా ఎన్నో పాటలు పాడి ఇద్దరు లవ్ చేసుకున్నారు. తర్వాత వివాహం చేసుకున్నారు. వీరు అనేక సినిమాల్లో చాలా హిట్ సాంగ్స్ పాడారు.
4. గీత మాధురి భర్త నందు కుటుంబం
గీతా మాధురి మరియు తన భర్త నందు వీరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. గీత మాధురి ఎన్నో పాటలతో మనని అలరిస్తోంది.
Advertisement
5. సింగర్ స్మిత తన భర్త శశాంక్
సింగర్ స్మిత అనేక హిట్ సాంగ్స్ పాడారు. హాయ్ రబ్బ హాయ్ రబ్బ.. మసక మసక చీకటిలో ఇలాంటి పాటలు పాడి చాలా ఫేమస్ అయ్యారు.
6. అంజనా సౌమ్య భర్త రవితేజ కుటుంబం
అంజనా సౌమ్య తన టాలెంట్ తో ఎన్నో పాటలు పాడి మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎన్నారై రవితేజ ని యూఎస్ లో వివాహం చేసుకుంది. వీళ్ళకు ఒక బాబు పుట్టారు.
7. చిన్మయి భర్త రాహుల్ రవి చంద్ర తో
నటుడు రాహుల్ రవిచంద్ర చిన్మయి వాయిస్ కి ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆమె రవిచంద్రన్ యాక్టింగ్ కు మెస్మరైజ్ అయింది. దీంతో ఏకంగా పెళ్లి చేసుకుంది.
8. సింగర్ మనో సాంగ్స్ తో పాటుగా రజినీకాంత్ కి తెలుగు డబ్బింగ్ చెబుతారు. ఆయన జమీలా ని వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
9. దీపు అతని భార్య స్వాతి
దీపు ఈగ,చిరుత, మగధీర, బాహుబలి,అతిధి వంటి మూవీస్ లో చాలా హిట్ సాంగ్స్ పాడారు. ఆయన స్వాతి ని వివాహం చేసుకున్నారు.
10. సింగర్ సునీత కుటుంబం
తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ సింగర్ సునీత. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె తన భర్త గోపరాజుకు విడాకులు ఇచ్చి, మరో వివాహం చేసుకుంది.