Advertisement
చిత్ర పరిశ్రమ ఎంత గొప్పనైనది. ఈ పరిశ్రమలో ఎంతోమంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు. అయితే అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పాతుకుపోయిన వారిలో టాలీవుడ్ కు చెందిన నటులు ఎంతోమంది ఉన్నారు. వయసు పైబడి సినిమాలకు దూరంగా కొంతమంది ఉండగా, మరికొంతమంది మాత్రం 70 ఏళ్లు పైబడినప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు. అయితే.. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన టాప్ 10 సౌత్ ఇండియా యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# ప్రకాష్ రాజ్
కన్నడ, తమిళ్ దూరదర్శన్ ఛానల్ లో పలు సీరియల్స్ లో నటించిన ప్రకాష్ రాజ్ కు ఆ తర్వాత కన్నడలో సపోర్టింగ్ రోల్స్ ఆఫర్స్ వచ్చాయి.
# నయనతార
నయనతార మొదటగా కేరళకు చెందిన కైరాలీ టీవీలో హెల్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేసింది. తర్వాత మనస్సినకారే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
#మాధవన్
మాధవన్ మొదట బనెంగి అప్ని బాత్, ఘర్ జమాయి లాంటి సీరియల్స్ లో నటించాడు.
# యష్
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా టాప్ హీరోగా గుర్తింపు పొందాడు యష్. అంతకుముందు తను సీరియల్స్ లో నటించాడు. తన భార్య రాధిక కూడా సీరియల్ నటి. ఇద్దరూ కలిసి పలు సీరియల్స్ చేశారు.
Advertisement
# విజయ్ సేతుపతి
యాక్టింగ్ ఐకాన్ గా పిలుచుకునే సేతుపతి మొదట తమిళ్ సన్ టీవీలో పెన్ అనే సీరియల్ లో, టీవీలో వచ్చిన నలయ ఇయాకునార్ అనే షోలో చేసిన వాడే.
# శివ కార్తికేయన్
స్టాండ్ ఆఫ్ కమెడియన్ గా స్టార్ విజయ్ ఛానల్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన శివ ఆనతి కాలంలోనే మంచి యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
# హన్సిక మోత్వాని
హన్సిక సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చింది. తోలుతా సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమా చేసింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో అవకాశం పొందింది.
#సాయి పల్లవి
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి పల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది.
#మృణాల్ ఠాకూర్
హిందీలో సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన మృనాల్, మెల్లగా మరాఠీ చిత్రాలతో వెండి తెరపై హీరోయిన్ గా మారింది.
# సుడిగాలి సుదీర్ సుడిగాలి సుదీర్ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సుధీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంకా సరైన హిట్ తన ఖాతాలో పడలేదు.