Advertisement
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఈ దర్శకులు తమ ప్రత్యేక కథనం మరియు చిత్రనిర్మాణ నైపుణ్యంతో పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ లో తెలంగాణకు చెందిన టాప్ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం.
Advertisement
#1 సురేందర్ రెడ్డి:
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జన్మించిన సురేందర్ రెడ్డి తన స్టైలిష్ మరియు యాక్షన్ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. “కిక్”, “రేసు గుర్రం” మరియు “ధృవ” వంటి చిత్రాలతో అతను పాపులారిటీ సంపాదించారు. సురేందర్ రెడ్డి సినిమాలు వారి వేగవంతమైన కథనాలు, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు మరియు ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లేకు ఈయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
#2 వంశీ పైడిపల్లి:
హైదరాబాదుకు చెందిన వంశీ పైడిపల్లి తన భావోద్వేగాలతో నడిచే చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. “బృందావనం”, “ఎవడు” మరియు “మహర్షి” వంటి చిత్రాలతో అతను గుర్తింపు పొందాడు. వంశీ పైడిపల్లి యొక్క సినిమాలు తరచుగా బలమైన భావోద్వేగ సన్నివేశాలను కలిగి ఉంటాయి.
#3 హరీష్ శంకర్:
Advertisement
షాక్ అనే సినిమాతో హరీష్ శంకర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. కానీ, తరువాత “మిరపకాయ్” సినిమాతో మరోసారి డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో హరీష్ శంకర్ పేరు మారుమ్రోగిపోయింది. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమా తీసి హిట్టు కొట్టారు. ప్రస్తుతం పవన్ తోనే “ఉత్సాద్ భగత్ సింగ్” సినిమాను తీస్తున్నారు.
#4 శ్రీకాంత్ ఓదెల:
నాని హీరోగా వచ్చిన సినిమా “దసరా” ను తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఈ డైరెక్టర్ తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నారు.
#5 వేణు శ్రీరామ్
సిద్ధార్థ్ “ఓ మై ఫ్రెండ్” సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ కాకున్నా ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఇక పవన్ కళ్యాణ్ తో తీసిన “వకీల్ సాబ్” సినిమా కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.
మరిన్ని..
బాలయ్యని మ్యాచ్ చేయలేకపోతున్న మెగాస్టార్.. ఈ లెక్క ఎక్కడ తప్పుతోందంటే?