Advertisement
కొంతమంది దర్శకులు సినిమాల మీద ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకొని సినిమా ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్కొక్కసారి సినిమాలు హిట్ అవ్వవు. అధిక నష్టాలు సినిమాలకి కలుగుతూ ఉంటాయి. అలాంటి సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం… తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక నష్టాలను తెచ్చిన టాప్ సినిమాలయితే ఇవి.
Advertisement
మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అత్యధిక నష్టాలు కలిగి కలిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ సినిమా కూడా నష్టాలని ఎదుర్కోక తప్పలేదు. కొమరం పులి, శక్తి సినిమాలకి కూడా నష్టాలే వచ్చాయి. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఒక్కమగాడు, చిరంజీవి మృగరాజు, బిగ్ బాస్ ఇలా చాలా సినిమాలకి నష్టాలూ తప్పలేదు.
బాలకృష్ణ హీరోగా వచ్చిన నిప్పురవ్వ సినిమా ఎక్కువ నష్టాలని తీసుకువచ్చింది. దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చింది ఈ సినిమాకి. చిరంజీవి బిగ్ బాస్ సినిమాకి దాదాపు నాలుగు కోట్ల నష్టం వచ్చింది. నాగార్జున రక్షకుడు సినిమాకి దాదాపు 7 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమాకి కూడా భారీ నష్టం వచ్చింది. దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం ఈ సినిమాకి కలిగింది. పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 13 కోట్ల నష్టం ఈ సినిమాకి కలిగింది.
Advertisement
బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. 2003లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆంధ్రావాలా, విజయేంద్ర వర్మ, నరసింహుడు, సుభాష్ చంద్రబోస్, సైనికుడు సినిమాలు 15 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి. ఒక్క మగాడు సినిమాకి దాదాపు 17 కోట్ల నష్టం వచ్చింది. కొమరం పులి సినిమాకి 22 కోట్ల నష్టం వచ్చింది.
ఖలేజా సినిమాకి 20 కోట్ల నష్టం కలిగింది. ఆరెంజ్, వరుడు, శక్తి, పరమవీరచక్ర సినిమాలు కూడా డిజాస్టర్ ల గానే మిగిలిపోయాయి. అత్యధిక నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వన్ నేనొక్కడినే సినిమా కూడా భారీ డిజాస్టర్ ని ఎదురుకోక తప్పలేదు. సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, సాహో సినిమాలు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. కోట్లలో ఈ సినిమాలకి నష్టం కలిగింది.
Also read: