Advertisement
చాలామంది థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి ఇటువంటి సినిమాని తీయడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇలాంటి కథలని స్క్రీన్ మీదకి తీసుకురాలేరు. అన్ని జోనర్స్ లోకి థ్రిల్లర్ తీయడం కష్టమైనది. అయితే మన తెలుగులో థ్రిల్లర్ సినిమాలు తీసి వాటిలో సక్సెస్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాంగోపాల్ వర్మ ఇటువంటి సినిమాలు తీయడంలో స్పెషల్. ఆయన మంచి త్రిల్లర్ సినిమాలు తీశారు. క్షణక్షణం మంచి థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా బాగా హిట్ అయింది.
Advertisement
అలానే అనుకోకుండా ఒక రోజు సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇది కూడా మంచి థ్రిల్లర్ సినిమా. ఛార్మి కెరియర్ లో మర్చిపోలేని సినిమా అని చెప్పొచ్చు. అలానే ఎవరు సినిమా కూడా మంచి థ్రిల్లర్ సినిమా. వెంకట్ రాంజీ సినిమాకి దర్శకత్వం వహించారు. సుకుమార్ దర్శకత్వంలో నేనొక్కడినే సైకలాజికల్ త్రిల్లర్ సినిమా కూడా అందరిని ఆకట్టుకుంది.
Advertisement
పవన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యూ టర్న్ సినిమా కూడా మంచి థ్రిల్లర్ మూవీ ఏ. సమంత అక్కినేని ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ చేసింది. ఈ సినిమా మంచి ఊహించని మలుపులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సాయి ధరంతేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా కూడా మంచి థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ కూడా చెప్పుకోదగ్గ సినిమాయే. అలానే కార్తికేయ, దృశ్యం, అనామిక, ఐతే, ఏ ఫిలిం బై అరవింద్, వి, రాక్షసుడు వంటివి కూడా మంచి థ్రిల్లర్ సినిమాలే.
Also read: