Advertisement
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు, దర్శకులకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఒక సినిమా విడుదల అవుతోంది అంటే దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని థియేటర్స్ కు వస్తున్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది. వారు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. అయితే కొందరు రెమ్యూనరేషన్ కాకుండా సినిమా బిజినెస్ లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తంగా టాప్ దర్శకుల నెంబర్లపై ఒక లుక్కేస్తే
Advertisement
Top Telugu Directors And Their Remunerations
Read Also: ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
#1 రాజమౌళి:
ఈ లిస్టులో డౌటు లేకుండా ఈయన పేరు ముందు వస్తుంది అని చాలామంది ఊహించి ఉంటారు. ఈయన ఒక్కో సినిమాకి రూ.120 కోట్ల పారితోషికం మరియు లాభాల్లో వాటా రూపంలో మొత్తంగా రూ.150 కోట్లు అందుకుంటున్నారు.
#2 ప్రశాంత్ నీల్:
‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాకి గాను ఈయన రూ.80 కోట్లు పారితోషికం మరియు లాభాల్లో వాటాతో కలుపుకొని రూ. 100 కోట్ల వరకు అందుకున్నారట.
Advertisement
#3 త్రివిక్రమ్:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు తీయకపోయినా, రూ.30 కోట్లకి పైనే పారితోషికం అందుకుంటున్నారు. అంతేకాకుండా అదనంగా లాభాల్లో వాటా కూడా అందుకుంటారు. ఈయన ఎక్కువగా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే సినిమాలు చేస్తున్నారు.
#4 సుకుమార్:
‘పుష్ప ది రైజ్’ చిత్రానికి గాను ఈయన రూ.30 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట. ‘పుష్ప 2’ కి రూ.45 కోట్లు అలాగే లాభాల్లో వాటాతో కలుపుకొని రూ. 60 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
#5 కొరటాల శివ:
‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి కొరటాల రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ‘ఆచార్య’ వల్ల ఈయన కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటివరకు సంపాదించింది కూడా పోయింది. కాబట్టి, ఇక ముందు ఈయన చేయబోయే సినిమాల్లో లాభాల్లో వాటా కూడా తీసుకోవాలని భావిస్తున్నారు.
READ ALSO : ఉత్తమ్ సింగ్, సూర్యనారాయణ టైటిల్, పోకిరిగా ఎలా మారింది? దాని వెనుకున్న స్టోరీ ఇదే.