Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. శనివారం మ.12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ప్రధాని తెలంగాణకు బయల్దేరుతారు. మ.1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టులో దిగుతారు. అనంతరం బీజేపీ స్వాగత సభలో పాల్గొంటారు. మ.1.40 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
Advertisement
మ.2.15 గంటలకు రామగుండం బయల్దేరి వెళ్తారు. మ.3.20 గంటల సమయంలో రామగుండంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయల్దేరి మ.3.30 గంటలకు ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ కు వెళ్తారు. సా.4.05 గంటలకు ఫ్యాక్టరీ నుంచి బయల్దేరి రూ.4.15 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. రామగుండంలో ఆర్‌ఎఫ్సీఎల్ తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారు మోడీ.
Advertisement
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నిల్ వరకు ట్రాఫిక్ ఉండే అధికంగా ఉండే చాన్స్ ఉందని చెప్పారు పోలీసులు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆ మార్గాల్లో కాకుండా వేరే రూట్స్ చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.