Advertisement
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ కేసు పై విచారణ చేపట్టిన విశాఖ త్రీ టౌన్ సీపీ త్రివిక్రమ్ ఆమెది ఆత్మహ*నని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేత (24) కి పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్ 22న వివాహం జరిగింది. మణికంఠ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత రెండేళ్లుగా ఇంటి వద్దనే ( వర్క్ ఫ్రం హోం) పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నాడు. శ్వేతా ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. మణికంఠ 15 రోజుల కిందట ఆఫీస్ పని మీద హైదరాబాద్ కి వెళ్ళాడు.
Advertisement
Read also: ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ…ఇప్పుడేం చేస్తుందో తెలుసా…
ఈ క్రమంలో విశాఖలో అత్తమామలతో శ్వేతకి మంగళవారం సాయంత్రం గొడవ జరిగింది. ఆ తరువాత భర్తతో ఫోన్ లో మాట్లాడేది శ్వేత. అయితే భర్తతో కూడా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్వేత సూ&& డ్ నోట్ రాసి గదిలో పెట్టి ఇంటి నుండి వెళ్లిపోయింది. శ్వేత పేరుపై కోటబొమ్మాలి లో ఉన్న 70 సెంట్లు భూమి తన పేరు పై రాయాలని భర్త మణికంఠ ఒత్తిడి తెస్తున్నాడు. శ్వేత ఆడపడుచులు ఇద్దరు తరచూ ఇంటికి వచ్చి భర్త లేని సమయంలో శ్వేతను వేధిస్తూ ఉండేవారు. ఓ సందర్భంలో మణికంఠ శ్వేత పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అప్పుడే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా.. శ్వేత తల్లి కాపాడింది. ఈ పరిణామాలన్నింటితో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్ ని వదిలిపెట్టి, సూసై* నోట్ రాసి, తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోయింది. రాత్రి 8 దాటిన తర్వాత ఇంటికి వచ్చిన శ్వేత అత్త పుష్పలత, మామ శాంతారావు ఇంటికి తాళం వేసి ఉండడంతో కోడలికి ఫోన్ చేశారు.
Advertisement
అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి 10 గంటల సమయంలో న్యూ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బీచ్ రోడ్డులోని వైఎంసిఐ ఎదురుగా తీరంలో ఒక యువతి మృ*దేహం ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టు బీచ్ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. అప్పటికే శ్వేతపై మిస్సింగ్ కేసు నమోదు అయి ఉండడంతో న్యూ పోర్ట్ పోలీసులు శ్వేతగా గుర్తించి అత్తమములకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూ**డ్ నోట్ లభ్యం కావడంతో ఆమె ఆ$%త్య పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై గృహహింస, ఆత్మ*త్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్వేత భర్త, అత్త మామ, ఆడపడుచు ఉన్నారు.
Read also: RAMA BANAM MOVIE HEROINE NAME, AGE, MOVIES, BIOGRAPHY