Advertisement
సినీ నటుడు నందమూరి తారకరత్న జనవరి 27వ తేదీన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ” యువగళం” పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ఇప్పటివరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తారకరత్నకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయనకు ఆసుపత్రి వైద్యులు మెదడుకు సంబంధించిన శాస్త్ర చికిత్సను పూర్తి చేశారు. నిజానికి రోజులు గడుస్తున్నాయి కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కుదుటపడడం లేదు.
Advertisement
Read also: సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్ట మయమే !
Advertisement
తారకరత్నను ఎయిర్ అంబులెన్స్ లో విదేశాలకు తీసుకెళ్ళనున్నారని వార్తలు కూడా వినిపించాయి. తారకరత్న మెదడుకు శస్త్ర చికిత్స చేసిన అనంతరం స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ స్కాన్ నివేదిక ఆధారంగా తారకరత్న విదేశాలకు తరలించే పరిస్థితి లేకపోవడంతో.. విదేశీ వైద్యులను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రప్పించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పటికే తారకరత్నకు షుగర్ ఉండడం వల్ల చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. తారకరత్న వయసు కేవలం 39 సంవత్సరాలు కాగా.. ఇండస్ట్రీలో వివాదాలు కూడా దూరంగా ఉండే హీరోగా పేరు ఉంది. రాజకీయాలలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే ఈ విధంగా జరిగిందని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఆయన గుండెపోటుకు గురై తొమ్మిది రోజులు గడుస్తున్నా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో నందమూరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read also: అలనాటి అందాల తార హీరోయిన్ “దివ్య భారతి” మరణానికి ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?