Advertisement
మాటల మాంత్రికుడు లేదా గురూజీ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. సినిమా మీద మక్కువతో చదువు అయిపోగానే బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చిన ఈయన మొదట సినిమాలకి కథలు రాయడం మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్ లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే రేంజ్ కి వచ్చాడు.
Advertisement
తరుణ్ హీరోగా నువ్వే నువ్వే అనే ప్రేమ కథ చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ లో టాప్ పెయిడ్ డైరెక్టర్లలో ఒకడు.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
Advertisement
సినిమాల సంగతి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ముఖ్యంగా ఈయన పెళ్లి ఎలా జరిగింది, పెళ్లిచూపులు కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఈయన ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి బంధువు. ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వచ్చి పేరు తెచ్చుకుంటున్న త్రివిక్రమ్ తన ఇంటి అల్లుడిగా మార్చేసుకున్నాడు సిరివెన్నెల. దర్శకుడిగా మారుతున్న సమయంలోనే ఆయనపై నమ్మకంతో తన సోదరుడి కూతురును ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. సిరివెన్నెల అలా త్రివిక్రమ్ నువ్వు సిరివెన్నెల పెళ్లి చూపులకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ అసలు కథ ఉంది.
అక్కడ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లిన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లిని ఇష్టపడ్డాడు మాటల మాంత్రికుడు. అయితే ఆ విషయం అక్కడ చెప్పలేదు. కానీ పెళ్లిచూపులు చూసిన తర్వాత స్వయంగా తానే వెళ్లి తనకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పాడు త్రివిక్రమ్. పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయి నచ్చిందని చెప్పాడు మాటల మాంత్రికుడు. అయితే అక్క పెళ్లి చేసిన తర్వాతే చెల్లిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఈయన. అలా సౌజన్య గారిని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు త్రివిక్రమ్ భార్య డాన్సర్.
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?