Advertisement
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అక్కినేని అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటుందని, తమ హీరోలను, వారి కుటుంబాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, నటుడు, టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సినిమా అభిమానులు, నెటిజెన్ల కోపానికి గురైయ్యాడు. కేవలం ఆయన చేసినటువంటి ట్వీటే అందుకు కారణమైంది. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వాక్యాలపై నాగచైతన్య, అఖిల్ తప్పు పట్టారు. దానికి కొనసాగింపుగానే బండ్ల గణేష్ తన స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. స్వతహాగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంటే బాగా ఇష్టపడే బండ్ల గణేష్ నాగ చైతన్య, అఖిల్ ట్వీట్లకు చిరంజీవి సార్ అనే మెగాస్టార్ పేరు జోడించి, ఆయన కూడా కళామతల్లి ముద్దుబిడ్డ అని చెప్పకనే చెప్పారు.
Advertisement
మెగా బ్యాచ్ కు భజన చేసి సంపాదించే నీది ఓ బతుకేనా బేవర్స్ నా, అంటూ మాటల్లో వర్ణించలేని విధంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అసలు నోరు జారిన బాలయ్య ఇష్యూ పై అక్కినేని బ్రదర్స్ ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటని బాలయ్య బాబు ఫ్యాన్స్ కవర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సినిమా అభిమానులే కాదు, నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా తోడై బండ్ల గణేష్ ను మాటల్లో చెప్పనంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ తర్వాత చిరంజీవి పేరును బండ్ల గణేష్ చేర్చడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఏం కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి లెజెండ్ హీరోలు నీకు కనిపించడం లేదా అంటూ వర్ణించలేని స్థాయిలో తిట్ల దండకం అందుకుంటున్నారు.
Read also: డైరెక్టర్ కొరటాల శివ భార్య ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే !