Advertisement
జీ-20 సదస్సుకు భారత్ ఈమధ్యే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఉంటుంది. కూటమిలోని దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఇద్దరు కీలక నేతలు పాల్గొన్నారు. వారే.. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్. చాలారోజుల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. అలాగే పీఎంతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు.
Advertisement
టీడీపీ వెర్షన్ ప్రకారం.. సమావేశం ప్రారంభానికి ముందు చంద్రబాబుతో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధానే స్వయంగా బాబును పిలిచి ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇద్దరూ చాలా సరదగా మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Advertisement
వైసీపీ వెర్షన్ ప్రకారం.. సమావేశంలో జగన్ ను మోడీ ఆప్యాయంగా పలకరించారు. టీ విరామ సమయంలో జగన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. ఏపీ పరిస్థితులపై జగన్ ను అడిగినట్లు తెలుసుకున్నారు. కానీ, షర్మిల గురించి కూడా అడిగారనే ప్రచారం సాగుతోంది. ఆ విషయం అటుంచితే.. జగన్, చంద్రబాబుతో మోడీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
జగన్ ను మోడీ పట్టించుకోలేదని టీడీపీ వర్గాలు బాగా ట్రోల్ చేస్తున్నాయి. ఈక్రమంలో కౌంటర్ గా జగన్ కి మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. కనీసం చంద్రబాబుకు కరచాలనం కూడా చేయలేదని కామెంట్లు పెడుతున్నారు. బాబు నమస్కారం చేస్తున్నా.. ప్రధాని పట్టించుకోలేదని.. కావాలంటే ఈ ఫోటోలను చూడండి అని రౌండ్ మార్క్ వేసి మరీ చూపిస్తున్నారు.