Advertisement
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందా? తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను RRR (రౌద్రం రణం రుధిరం) పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు.. నాటు నాటు పాట 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును గెలుచుకుంది. అయితే, రాజమౌళి ఆస్కార్ అవార్డు సాధించడానికి 80 కోట్లు ఖర్చు చేశాడు అని ఒక మనిషి అంటే, లేదు అంతకంటే ఎక్కువ పెట్టారు అని మరొకరు అంటారు. ఇలా ఎవరు ఎన్ని మాట్లాడిన ఇప్పటివరకు ఏ భారతీయుడికి సాధ్యం కానీ ఆస్కార్ అవార్డు మాత్రం రాజమౌళికి వచ్చింది.
Advertisement
కానీ దాని వెనుక ఉన్న కష్టం, దానికోసం ప్రయత్నించి విఫలమైన వారిని అడిగితే తప్ప తెలియదు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అమీర్ ఖాన్. 2002లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘లగాన్’ సినిమా కోసం అమీర్ ఖాన్ ఆస్కార్ సంపాదించాలని తీవ్రంగా కష్టపడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు బిలియన్ డాలర్ల రూపాయలను వెచ్చించి మరి ఓడిపోయి తిరిగి వచ్చాడు. రెండు బిలియన్ డాలర్లు అంటే 20 లక్షల డాలర్లు మీరే లెక్క వేసుకోండి. రెండు దశాబ్దాల క్రితం ఇంత ఖర్చుపెట్టిన అమీర్ ఖాన్ కి అవార్డు రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అతను చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఆ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ లెక్కల ప్రకారం సినిమాను వీలున్నంత వరకు ఎక్కువ మంది జూరీ మెంబర్స్ కి చూపించడానికి అమెరికా లాస్ ఏంజిల్స్ కి వెళ్లారు. అలా వెళ్లి ప్రతి ఒక్కరికి చూపించాలి అనుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కూడా విజయం సాధిస్తాను అని ఒకే ఒక నమ్మకంతో ఆ పని చేశారు. ఇది తొలి దశలో ఉన్నంతవరకే. ఆ తర్వాత చాలామందికి ఇంకా సినిమాలు చూపించాల్సి ఉంటుంది. మొదటి 5 లేదా 6 చిత్రాలని ఆస్కార్ అవార్డు ఎంపిక కోసం సభ్యులంతా కలిసి మరొకసారి చూస్తారు. దీనికి చాలా ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది.
Advertisement
అలా మొదటి ఐదు చిత్రాలలో లగాన్ పేరు కూడా ఉండడంతో అమీర్ ఖాన్ మరింత ఖర్చుకు వెనకాడలేదు. అతని చేతిలో పవర్ ఫుల్ పబ్లిసిటీ టీం కూడా ఉండింది. ఓట్లు వేయించుకోవడం కోసం కూడా చాలా ఖర్చు పెట్టాడు ఆమీర్ ఖాన్. ఇక ఖరీదైన హోటల్లో ఒక్కో జ్యూరీ మెంబర్ కు విందులు ఇవ్వాలి. ప్రమోషన్ చేయమని అభ్యర్థించాలి. ఖరీదైన హోటళ్లలో పార్టీలు అంటే ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఉంటాడు ఆలోచించవచ్చు. అంత చేసిన ఆస్కార్ అయితే రాలేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉన్న అమీర్ ఖాన్ అవార్డు తీసుకు రాలేకపోవడం వెనక కారణాలు ఏంటో తెలియదు. కానీ అప్పట్లో అన్ని మెయిన్ పేపర్స్ లో లగాన్ సినిమా గురించి ప్రకటనలు ఇచ్చేవాడట. కేవలం ఇలా ప్రకటన కోసమే కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడట అమీర్ ఖాన్. అక్కడ ఉన్న పరిస్థితుల మీద ఎలాంటి అవగాహన లేని కొందరు మాత్రమే ఇలాంటి వాక్యాలు చేస్తూ ఉంటారు. వారందరూ ఒక్కసారి ఆస్కార్ కోసం ప్రయత్నిస్తే తప్ప ఆ బాధ ఏంటో అర్థం కాదు.