Advertisement
సీరియల్ బ్యాక్ గ్రౌండ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగమణికంఠ సీరియల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తప్ప ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాడు. అతనికి రెండు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడని తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకుందని అతని వయసు వచ్చాక యాక్సెప్ట్ చేసుకోలేక పోయినట్లు.. కొన్నాళ్ళకి తల్లికి క్యాన్సర్ వచ్చి ఆమె చనిపోయిందని ఇలా తన గురించి చెప్పి బాధపడి ఎమోషనల్ అయిపోయాడు. ఎలిమినేట్ అయినట్లు ఒక ప్రాంక్ తిరగడంతో సింపతి తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్పుకుంటూ ఒకానొక సమయంలో నెలలు కొద్దీ నాలుగు గోళ్ళ మధ్య ఉండిపోయానని చెప్పాడు.
Advertisement
ఆ సమయంలో డిప్రెషన్ కి గురైనట్లు చెప్పిన అతను చనిపోవాలని కూడా అనుకున్నాను అని అన్నాడు. అలా చెప్పాక ఎలిమినేట్ అయినట్లు ఒక ప్రాంక్ జరగడంతో సింపతి తోనే ఎంతోమంది అభిమానుల్ని గెలుచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ సపరేట్ గా ఉంటూ మిగిలిన కంటెస్టెంట్లతో కలవకుండా ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ గా చూస్తూ ఉండడంతో నామినేషన్స్ పడ్డాయి. అలా నామినేషన్స్ ఎక్కువ పడడం కూడా అతనికి ప్లస్ అయింది.
Advertisement
Also read:
ఎంతోమంది మణికంఠ ఆర్మీలోకి చేరారు. అయితే ఈ నామినేషన్స్ లో వాదించడంలో కూడా ఆయన గతాన్ని చెప్తూ సింపతీని వాడుకుంటున్నాడు. మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండండి ఏమడిగినా చెప్పకుండా మీకు తెలియదు తెలియదు అనడం కరెక్ట్ కాదని కంటెస్టెంట్స్ అనడంతో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఇకపై ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తలపై విగ్గుని తీసేసాడు. అలానే ట్రాన్స్పరెంట్ అని బట్టలు తీసేవు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!